iDreamPost

TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. మళ్లీ జనవరి 2 నుంచి పక్కా..!

తిరుమలకు సంబంధించిన వార్తలను తెలుసుకునేందుకు శ్రీవారి భక్తులు ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే శ్రీవారి భక్తులకు టీటీడీ ఓ శుభవార్త చెప్పింది. సర్వదర్శన టోకెన్ల జారీ విషయంలో కీలక సమాచారం ఇచ్చింది.

తిరుమలకు సంబంధించిన వార్తలను తెలుసుకునేందుకు శ్రీవారి భక్తులు ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే శ్రీవారి భక్తులకు టీటీడీ ఓ శుభవార్త చెప్పింది. సర్వదర్శన టోకెన్ల జారీ విషయంలో కీలక సమాచారం ఇచ్చింది.

TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. మళ్లీ జనవరి 2 నుంచి పక్కా..!

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల కొండపై వెలసినాడు. ఆయనను దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. కోరికన కోర్కెలు తీర్చే దైవంగా శ్రీవారికి ఎంతో పేరు ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు భక్తులు ఉన్నారు. అందుకే ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇదే సమయంలో తిరుమలకు సంబంధించిన సమాచారాన్ని టీటీడీ తెలియజేస్తోంది. ఇక టీటీడీ నుంచి వచ్చే సమచారం కోసం భక్తులు కూడా ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే అనేక గుడ్ న్యూస్ లో చెప్పిన టీటీడీ.. తాజాగా భక్తులకు మరో శుభవార్త చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మండలి శుభవార్త చెప్పింది. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ పూరైంది. దీంతో తదుపరి సర్వదర్శనం టోకెన్ల విషయంలో టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. సర్వదర్శన టోకెన్లను జనవరి 2వ తేదీ నుంచి జారీ చేస్తామని టీటీడీ తెలిపింది. డిసెంబర్ 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వ దర్శన టోకెన్లను జారీ సోమవారం ఉదయం పూర్తైంది. తిరుప‌తిలోని విష్ణునివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, బైరాగిపట్టెడలోని రామానుడు హైస్కూల్,  శ్రీ‌నివాసం, భూదేవి కాంప్లెక్స్‌, రామచంద్ర పుష్క‌రిణి, ఇందిరా మైదానం, ఎంఆర్ ప‌ల్లిలోని ప్రభుత్వ పాఠశాల… ఇలా 90 కౌంట‌ర్లలో 10 రోజుల‌కు గాను 4 ల‌క్ష‌లకుపైగా స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్లను సోమ‌వారం ఉద‌యానికి వరకు జారీ చేశారు.

good news for ttd devotees

సోమవారం ఉదయంతో ఈ టోకెన్ల జారీ పూర్త‌యింది. టోకెన్లు లేని భక్తులను దర్శనానికి అనుమతించరని.. ఈ విషయాన్ని గమనించి టీటీడీ కోరింది. డిసెంబ‌రు 26వ తేదీన‌ తిరుమల శ్రీవారి ఆల‌యంలో పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఈసారి శ్రీ‌వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పౌర్ణ‌మి గరుడసేవ ఉండదని సమచారం. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించాలని టీటీడీ సూచించింది.

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి తెప్పోత్సవాల్లో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమ‌వారం శ్రీ కామాక్షి అమ్మ‌వారు ద‌ర్శ‌న‌మిచ్చారు. సోమవారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు ఈ వేడుక కన్నులపండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ కామాక్షి, ల‌క్ష్మీ, స‌ర‌స్వ‌తి అమ్మ‌వార్లు ఆశీనులయ్యారు. ఈ ఉత్సవాహన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. మరి.. సర్వదర్శన టోకెన్ల జారీ విషయంలో టీటీడీ ఇచ్చిన సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి