iDreamPost

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త!

TSRTC: తెలంగాణ ఆర్టీసీలో వేలాది మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి సంస్థ తరచూ ఏదో ఒక శుభవార్త చెబుతుంది. తాజాగా ఆర్టీసీలో పని చేస్తూ మరణించిన కార్మికుల కుటుంబాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

TSRTC: తెలంగాణ ఆర్టీసీలో వేలాది మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి సంస్థ తరచూ ఏదో ఒక శుభవార్త చెబుతుంది. తాజాగా ఆర్టీసీలో పని చేస్తూ మరణించిన కార్మికుల కుటుంబాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త!

ఆర్టీసీ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజా రవాణాలో కీలకమైన వాటిల్లో ఆర్టీసీ ఒకటి. ప్రతి రాష్ట్రానికి ఆర్టీసీ వ్యవస్థ అనేది ఉంటుంది. ఈ సంస్థ ద్వారా నిత్యం వేలాది మంది తమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. అలానే ఆర్టీసీ సంస్థలకు కూడా ప్రజల సౌకర్యార్థం అనేక సదుపాయాలు కల్పిస్తుంటాయి. అలానే సంస్థలో పని చేసే వారి విషయంలోను అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు అనేక సదుపాయాలు కల్పిస్తుంటారు. ఇలా ఆర్టీసీ.. ప్రయాణికులకు, కార్మికులకు శుభవార్తలు చెబుతూనే ఉంటుంది. తాజాగా కార్మికులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన సంస్థల్లో ఆర్టీసీ ఒకటి. ఆర్టీసీ బస్సుల ద్వారా నిత్యం వేలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. అలానే ఈ సంస్థలో వేలాది సంఖ్యలో కార్మికులు పని చేస్తూ ఉంటారు. వీరికి తరచూ ప్రభుత్వం, సంస్థ అధికారులు శుభవార్త చెబుతుంటారు. డీఏ పెంపు, ఇతర అలెవెన్సుల పెంచుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలానే ఆర్టీసీలో పని చేస్తూ చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకునే విషయంలో ఆ సంస్థ ముందుంటుంది. గతంలో కారుణ్య నియామకం కింద పలు పోస్టులను భర్తీ చేసింది.

goodnews for tsrtc workers

తాజాగా ఆర్టీసీలో పని చేస్తూ మృతి చెందిన కార్మికుల  కుటుంబాలకు న్యాయం చేసేందుకు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. మృతి చెందిన కార్మికుల పిల్లలకు కన్సాలిడేటెడ్ వేతనంపై కండక్టర్లుగా నియమించాలని సంస్థ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 11 ఆర్టీసీ రీజియన్ల పరిధిలో 813 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. అత్యధికంగా సికింద్రబాద్ రీజియన్ లో  126, అత్యుల్పంగా కరీంనగర్ రీజియన్ ఫరిదిలో 45 ఉన్నాయి. ఇతర రిజీయన్లలో కూడా దరఖాస్తులు అధిక సంఖ్యలోనే ఉన్నాయి. వీటిని పూర్తి చేసేందుకు  ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఇటీవలే సంక్రాంతి కానుక గా ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే.

పండగకు ఊర్లకు వెళ్లే వారికి రాయితీని కల్పిపించింది. అలానే అదనపు  బస్సులు వేస్తున్నట్లు .. రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు తెలిపాయి.  రానుపోనూ  రిజర్వేషన్ చేయించుకుంటే 10 శాతం రాయితీ కల్పిస్తూ  ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. అలానే అదనపు బస్సులకు ఎలాంటి ఎక్స్ ట్రా ఛార్జీలు వసూలు చేయడం లేదని అధికారులు తెలిపారు. సాధారణ ఛార్జీలతోనే స్పెషల్ బస్సుల్లో ప్రయాణించ వచ్చని తెలిపారు.  ఇలా శుభవార్తలు అందిస్తున్న ఆర్టీసీ కార్మికల విషయంలో కూడా గుడ్ న్యూస్ చెప్పింది. మరి.. టీఎస్ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి