iDreamPost

RTCలో మహిళలకు ఫ్రీ జర్నీ.. వారు మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే!

TSRTC: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన మహాలక్ష్మి పథకం కి మహిళలనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అక్కడడక్కడ చిన్న సమస్యలు ఎదురవుతున్నప్పటికీ.. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పని చేస్తున్నారు.

TSRTC: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన మహాలక్ష్మి పథకం కి మహిళలనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అక్కడడక్కడ చిన్న సమస్యలు ఎదురవుతున్నప్పటికీ.. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పని చేస్తున్నారు.

RTCలో మహిళలకు ఫ్రీ జర్నీ.. వారు మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రమాణ స్వీకారం చేశారు. ఇక సీఎంగా పదవి చేపట్టిన తొలి రోజు నుంచి రేవంత్ రెడ్డి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ అందరని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అసెంబ్లీలో సైతం తనదైన మాటలతో ప్రతిపక్షాలను ఇరుకున  పెడుతున్నారు. ఇక కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో కొన్నిటిని ఇప్పటికే అమలు చేస్తోంది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకంను ప్రారంభించి.. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తుంది. తాజాగా టీఎస్ ఆర్టీసీలో మహిళల ఫ్రీ జర్నీపై అధికారులు స్పష్టత నిచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 9 మహాలక్ష్మి పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి మహిళల నుంచి ఊహించిన దానికంటే మించి స్పందన వస్తుంది. ఆర్టీసీ బస్సులో అక్యూపెన్సీ కూడా బాగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవచ్చు. ఇటీవలే మహిళలకు జీరో టికెట్ ను కూడా ఆర్టీసీ వారు ఇష్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా  ఎంతమంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారనేది తెలుస్తుందని అధికారులు అంటున్నారు. అలానే ఈ ఫ్రీ జర్నీ విషయంలో చాలా మందికి అనేక సందేహాలు ఉన్నాయి.

మహిళలకు ఫ్రీ అనగానే  ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా తమకు ఫ్రీ అంటూ వాగ్వాదం చేస్తున్నారు. ఇటీవలే కర్నాటకు చెందిన ఓ మహిళ టీఎస్ ఆర్టీసీ కండక్టర్ తో వాగ్వాదం పెట్టుకుంది. ఇలా మహిళ ఉచిత ప్రయాణం విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంకి సంబంధించి ఆర్టీసీ ఓ క్లారిటీ ఇచ్చింది. మహాలక్ష్మి పథకం కింద ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ అందిస్తున్నారు. ఈ ఉచిత ప్రయాణంపై టీఎస్ ఆర్టీసీ స్పష్టత ఇచ్చింది. ఈ స్కీమ్ కేవలం తెలంగాణ మహిళలకు మాత్రమే వర్తిస్తుందని, ఇదే రాష్ట్రానికి చెందిన వారిగా ధ్రువీకరించే ఫోటోతో కూడిన ఫ్రూప్ ఒరిజనల్ చూపించాలని స్పష్టం చేశారు.

ఇతర రాష్ట్రాల మహిళలు కచ్చితంగా ఛార్జీ చెల్లించి టికెట్ పొందాల్సిందేనని తెలిపారు. ఐడీల్లో ఫోటోలు అస్పష్టంగా ఉంటే వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. ఇక ఈ ఉచిత ప్రయాణం ద్వారా ఈ 12 రోజుల కాలంలో 3 కోట్ల మంది ప్రయాణం చేశారని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. అంతేకాక ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా బస్సులు అందుబాటులోకి తెస్తామని అధికారులు అంటున్నారు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంపై మహిళల్లో సానుకూల స్పందన వస్తుంది.  మరి.. ఉచిత ప్రయాణంపై  టీఎస్ ఆర్టీసీ ఇచ్చిన స్పష్టతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి