iDreamPost

TSRTC: మేడారం భక్తులకు అలర్ట్‌.. బస్‌ ఛార్జీలు ఖారారు చేసిన ఆర్టీసీ.. ఆ వివరాలు..

  • Published Feb 14, 2024 | 11:03 AMUpdated Feb 14, 2024 | 11:03 AM

మేడారం మహా జాతకు సమయం దగ్గర పడుతోంది. ఈక్రమంలో టీఎస్‌ఆర్టీసీ మేడారం వెళ్లే భక్తులకు బస్‌ ఛార్జీలను ఖరారు చేసింది. ఆవివరాలు..

మేడారం మహా జాతకు సమయం దగ్గర పడుతోంది. ఈక్రమంలో టీఎస్‌ఆర్టీసీ మేడారం వెళ్లే భక్తులకు బస్‌ ఛార్జీలను ఖరారు చేసింది. ఆవివరాలు..

  • Published Feb 14, 2024 | 11:03 AMUpdated Feb 14, 2024 | 11:03 AM
TSRTC: మేడారం భక్తులకు అలర్ట్‌.. బస్‌ ఛార్జీలు ఖారారు చేసిన ఆర్టీసీ.. ఆ వివరాలు..

వనదేవతల మహాజాతర.. తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు సమయం దగ్గరపడుతోంది. మరో వారం రోజుల్లో అనగా ఫిబ్రవరి 21 నుంచి మహా జాతర ప్రారంభం కానుంది. గత వారమే గుడిమెలిగే పండుగతో మేడారం జాతరకు అంకురార్పణ జరిగింది. ఇక మేడారం జాతరం కోసం తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.105 కోట్ల నిధులు మంజూరు చేసింది. మంత్రి సీతక్క స్వయంగా దగ్గరుండి అక్కడి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్న మేడారం మహాజాతరలో వనదేవతలను దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో మేడారం జాతారకువెళ్లే వారి కోసం బస్‌ ఛార్జీలను నిర్ణయించింది సంస్థ. ఆ వివరాలు..

ఈసారి మేడారం జాతరకు భక్తులను తీసుకొచ్చేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్‌ఆర్టీసీ 51 కేంద్రాల నుంచి ఏకకాలంలో 6 వేలకు పైగా బస్సులను నడిపేందుకు సిద్ధం అవుతోంది. ఈ సారి మహిళల కోసం మహాలక్ష్మి పథకం అమల్లోకి రావడంతో.. వారికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అందువల్ల ఈ ఏడాది ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నడిచే ఆరు వేలకు పైగా ఆర్టీసీ బస్సుల్లో సుమారు 40 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మేడారం వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ఛార్జీలను నిర్ణయించింది టీఎస్‌ఆర్టీసీ సంస్థ. మహాలక్ష్మి పథకం ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. దాంతో ఆర్టీసీ అధికారులు పురుషులకు చార్జీలను విడుదల చేశారు. అధికారులు విడుదల చేసిన వివరాల ప్రకారం బస్సు నిర్వహణ కేంద్రం, కిలోమీటర్లు, పెద్దలు, పిల్లలకు చార్జీలు ఇలా ఉన్నాయి.

చార్జీలు ఇలా..

  1.  హనుమకొండ-మేడారం జాతర: బస్సు ఛార్జీలు పెద్దలకు 250, పిల్లలకు 140గా నిర్ణయించారు.
  2. మేడారంజాతర-కాజీపేట: పెద్దల ఛార్జీలు: 250, పిల్లల ఛార్జీలు: 140
  3. వరంగల్-మేడారం జాతర: పెద్దల ఛార్జీ: 250, పిల్లల ఛార్జీ: 140
  4. జనగామ-మేడారం జాతర: పెద్దల ఛార్జీలు: 370, పిల్లల ఛార్జీలు: 210
  5. హైదరాబాద్-మేడారం: పెద్దల ఛార్జీ: 550, పిల్లల ఛార్జీ: 310
  6. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల నుండి మేడారం: పెద్దల ఛార్జీలు: 300, పిల్లల ఛార్జీలు: 180
  7. మేడారం జాతర-నర్సంపేట: పెద్దల ఛార్జీలు: 250, పిల్లల ఛార్జీలు: 150
  8. కొత్తగూడ-మేడారం జాతర: పెద్దల ఛార్జీలు: 300, పిల్లల ఛార్జీలు: 170
  9. పరకాల-మేడారం జాతర: పెద్దల ఛార్జీలు: 250, పిల్లల ఛార్జీలు: 140
  10. చిట్యాల-మేడారం జాతర: పెద్దల ఛార్జీలు: 250, పిల్లలకు ఛార్జీలు: 140
  11. మహబూబాబాద్-మేడారం: పెద్దల ఛార్జీలు: 350, పిల్లల ఛార్జీలు: 190
  12. గూడూరు-మేడారం జాతర:పెద్దల ఛార్జీలు: 280, పిల్లల ఛార్జీలు: 160
  13. తొర్రూర్-మేడారం జాతర:పెద్దల ఛార్జీ: 350, పిల్లల ఛార్జీ: 190
  14. వర్ధన్నపేట-మేడారం జాతర: పెద్దల ఛార్జీలు: 300, పిల్లలకు ఛార్జీలు: 160
  15. మేడారం జాతర-ఆత్మకూరు: పెద్దల ఛార్జీలు: 210, పిల్లల ఛార్జీలు: 120
  16. మల్లంపల్లి-మేడారం జాతర: పెద్దల ఛార్జీలు: 180, పిల్లల ఛార్జీలు: 110
  17. మేడారం జాతర-ములుగు: పెద్దల ఛార్జీలు: 150, పిల్లల ఛార్జీలు: 90
  18. మేడారం జాతర-భూపాలపల్లి: పెద్దల ఛార్జీలు: 220, పిల్లల ఛార్జీలు: 130
  19. మేడారం జాతర-ములుగు ఘణపురం:పెద్దల ఛార్జీలు: 200, పిల్లల ఛార్జీలు: 110
  20. మేడారం జాతర-జంగాలపల్లి: పెద్దల ఛార్జీలు: 150, పిల్లల ఛార్జీలు: 90
  21. పస్రా-మేడారం జాతర: పెద్దల ఛార్జీలు: 80, పిల్లల ఛార్జీలు: 50
  22. మేడారం జాతర-గోవిందరావుపేట: పెద్దల ఛార్జీలు: 100, పిల్లల ఛార్జీలు: 60
  23. తాడ్వాయి-మేడారం జాతరకు: పెద్దల ఛార్జీలు: 60, పిల్లల ఛార్జీలు: 40

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి