iDreamPost

వీడియో: మురికి కాల్వలో చెత్తను చేతితో తీసిన మంత్రి హరీశ్ రావు!

వీడియో: మురికి కాల్వలో చెత్తను చేతితో తీసిన మంత్రి హరీశ్ రావు!

తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి. హరీశ్ రావు గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా ఈయనకు పేరుంది. అలానే బీఆర్ఎస్ ముఖ్యనేతల్లో ఒకరైన ఈయన ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. నిత్యం పరిపాలనకు సంబంధించిన పనులతో ఆయన బిజీ బిజీగా ఉంటారు. అయినా సరే మరొక వైపు తన నియోకవర్గంలో పర్యటిస్తూ.. సామాన్యుడిలా స్థానికులతో కలిసిపోతారు.  తరచూ తన నియోజకవర్గం సిద్ధిపేట్ లో పర్యటిస్తూ.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.  సోమవారం కూడా తన నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి హరీశ్ రావు.. డ్రైనేజిలోని చెత్తను..స్వయంగా చేతితో తీసి.. అందరిని ఆశ్చర్య పరిచారు.

అధికార బీఆర్ఎస్ పార్టీలో టి.హరీశ్ రావు కీలక నేత. అంతేకాక రాష్ట్రంలో కీలకమైన ఆర్ధిక శాఖకు మంత్రి. ఆయన నిత్యం అధికార కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, ఇతర పర్యటనలతో బిజీబీజీగా ఉంటే మంత్రి సోమవారం ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. “చెత్తను తొలగిద్దాం-ఆరోగ్యంగా ఉందాం” అనే కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం మంత్రి హరీష్ రావు సిద్దిపేట పట్టణంలోని 18 వార్డులో పర్యటించారు. ప్రతి వీధి తిరుగుతూ.. వార్డులో కొన్ని చోట్ల ఉన్న మురికాల్వనలోని చెత్తను హరీశ్ రావు స్వయంగా తన చేతితోనే తీసివేశారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే.. ఆరోగ్యం బాగుంటుంది అంటూ అందరికీ సూచించారు. అలానే  చెత్తను సంచుల్లోకి ఎత్తి స్వచ్ఛ సిద్ధిపేట కార్యక్రమంలో పౌరులంతా భాగస్వాములు కావాలని సిద్ధిపేటను శుద్దిపేటగా మార్చుకుందామని మంత్రి పిలుపు నిచ్చారు. చెత్త రహిత  ఆరోగ్య సిద్ధిపేట్ కోసం కృషి చేద్దామని ఆయన తెలిపారు. చెత్త కుండీలు లేని పట్టణంగా సిద్దిపేటను మార్చుదామని మంత్రి హరీశ్ రావు పిలుపు నిచ్చారు. “నడకతో ఆరోగ్యం.. చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణం” అనే నినాదంతో సిద్ధిపేట మున్సిపాలిటీ మరో సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలోమంత్రి హరీశ్ రావు పాల్గొన్ని స్థానిక ప్రజలకు పలు సూచనలు చేశారు.

అలా ప్రసంగించి  వెళ్లిపోకుండా ఆ వార్డు మొత్తం తిరిగి, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత పాటించాలని ప్రజలకు సూచించారు. అంతేకాక మురికి కాల్వల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్, చాయ్ గ్లాసులు, ఇతర చెత్తను స్వయంగా మంత్రి హరీష్ రావు చేతితో ఎత్తి సంచిలో వేశారు. ప్రస్తుతం మంత్రి హరీశ్ రావుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి..తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండిమొదలైన భారీ వర్షం.. అత్యవసరం అయితేనే బయటకు రండి..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి