iDreamPost

పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్చాఫ్.. కంటతడి పెట్టుకున్న తల్లిదండ్రులు.. సీఎం రేవంత్ కు ఫిర్యాదు చేస్తామంటూ

  • Published Dec 20, 2023 | 11:45 AMUpdated Dec 20, 2023 | 11:45 AM

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచిన తమ కుమారుడు పల్లవి ప్రశాంత్ కు ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదంటూ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. తమ కుమారుడి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని తెలిపారు. ఆ వివరాలు..

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచిన తమ కుమారుడు పల్లవి ప్రశాంత్ కు ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదంటూ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. తమ కుమారుడి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని తెలిపారు. ఆ వివరాలు..

  • Published Dec 20, 2023 | 11:45 AMUpdated Dec 20, 2023 | 11:45 AM
పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్చాఫ్.. కంటతడి పెట్టుకున్న తల్లిదండ్రులు.. సీఎం రేవంత్ కు ఫిర్యాదు చేస్తామంటూ

బిగ్ బాస్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ కు ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ నాడు అనగా ఆదివారం రోజున అన్నపూర్ణ స్టూడియో బయట చోటు చేసుకున్న గొడవలు, అమర్ కారు పై దాడి, ఆర్టీసీ బస్సు పైకి రాళ్లు రువ్వడం తదితర సంఘటనల నేపథ్యంలో.. పోలీసులు పల్లవి ప్రశాంత్ మీద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ బస్సు పై రాళ్లు రువ్విన కేసులో పోలీసులు అతడిని ఏ 1గా చేర్చారు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ పరారీలో ఉండగా.. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రస్తుత పరిణామాలపై పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు స్పందిస్తూ.. కంటతడి పెట్టుకున్నారు. బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న ఓ సామాన్య రైతు బిడ్డకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాక ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆ వివరాలు..

కోట్లాదిమంది తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్న బిగ్‌బాస్‌ సీజన్‌–7 విజేత, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌పై కక్షసాధింపు చర్యలు తగవని హైకోర్టు న్యాయవాది డాక్టర్‌ కే రాజేశ్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం ప్రశాంత్‌ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ప్రశాంత్‌పై వివిధ సెక్షన్లతో కేసు నమోదైనట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు.

అయితే ఇప్పటి వరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఆన్‌లైన్‌లో పెట్టలేదని తెలిపారు. అరెస్ట్‌ చేస్తారనే భయంతో ప్రశాంత్‌తోపాటు అతడి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారన్నారు. సామాన్య రైతు బిడ్డగా వెళ్లి బిగ్‌బాస్‌ టైటిల్‌ను గెలుచుకున్న యువకునికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆయన ప్రశ్నించారు.

నగరంలో జరిగిన సంఘటనల వెనక.. ప్రశాంత్ బిగ్ బాస్ విజేతగా నిలవడం ఇష్టం లేని శక్తులు ఉన్నాయనే అనుమానం నెలకొని ఉందన్నారు. ఈ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. పోలీసులు చట్ట ప్రకారం వెళ్తే తాము అడ్డుపడబోమని స్పష్టం చేశారు. కానీ ప్రశాంత్‌పై కేసు నమోదు చేసినట్లయితే.. వెంటనే పోలీసుశాఖ వెబ్‌సైట్‌లో అందుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలను పెట్టాలని డిమాండ్‌ చేశారు.

ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సైతం ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. పల్లవి ప్రశాంత్‌ విజేతగా నిలిచిన ఆనందాన్ని కోల్పోయి.. ఫోన్‌ కూడా స్విచ్ఛాప్‌ చేసుకొని ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్లిపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. అతనికి అండగా ఉంటూ న్యాయసహాయం అందిస్తానని ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేశ్ కుమార్ తెలిపారు.

 ప్రశాంత్ తల్లిదండ్రులు కంటతడి..

విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తమ కొడుకుపై కక్ష సాధిస్తున్నారంటూ.. ప్రశాంత్‌ తల్లిదండ్రులు కంటతడిపెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి ప్రశాంత్‌ ఎంతోకష్టడి చివరకు తానూ అనుకున్నదని సాధించాడని, కానీ ఈ సంతోషం కొన్ని గంటలు కూడా నిలవలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేసులు పెట్టి అరెస్ట్‌ చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అండగా నిలవాలని ఈ సందర్భంగా ప్రశాంత్ తల్లిదండ్రులు కోరారు. మరోవైపు ప్రశాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి