iDreamPost

KTR కీలక సూచన.. అలాంటి వీడియోలు వైరల్‌ కావొచ్చు.. ట్రాప్‌లో పడకండంటూ

  • Published Nov 24, 2023 | 2:35 PMUpdated Nov 24, 2023 | 2:35 PM

తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మాట్‌ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలు..

తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మాట్‌ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలు..

  • Published Nov 24, 2023 | 2:35 PMUpdated Nov 24, 2023 | 2:35 PM
KTR కీలక సూచన.. అలాంటి వీడియోలు వైరల్‌ కావొచ్చు.. ట్రాప్‌లో పడకండంటూ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 6 రోజులు మాత్రమే సమయం ఉంది. మూడు రోజుల తర్వాత మైక్‌లు మూగబోతాయి. ఎందుకంటే ఎన్నికలకు 48 గంటల ముందు నుంచే ప్రచార కార్యక్రమాలు ఆపేయాలని ఈసీ నిర్ణయం. క్యాంపెయిన్‌కు మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో.. పార్టీలు, అభ్యర్థులు దూకుడు పెంచారు. ప్రచారంలో జోరుగా దూసకుపోతున్నారు. ప్రసుత్తం నేతలందరూ ఎలక్షన్‌ క్యాంపెయిన్‌లో బిజీగా ఉన్నారు. పోలింగ్‌కి సమయం దగ్గర పడుతుండటంతో.. అభ్యర్థులందరూ కూడా నేరుగా ప్రజలను కలుస్తూ ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మినిస్టర్‌ కేటీఆర్‌ సోషల్‌ మీడియా ద్వారా పార్టీ కార్యకర్తల్ని, సోషల్‌ మీడియా యాక్టివర్స్‌ను అప్రమత్తం చేశారు. వారికి కీలక సూచనలు జారీ చేశారు.

ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేస్తూ.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే ఈ 5, 6 రోజుల్లోనే స్కామ్ గ్రెస్ స్కామర్ల నుంచి అనేక తప్పుడు, డీప్‌ ఫేక్‌ వీడియోలు బయటకు వస్తాయని తెలిపారు. అసత్య ఆరోపణలు ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తారని చెప్పుకొచ్చారు. ఎవరూ కూడా ఈ మోసపు వలలో చిక్కుకోవద్దని ఈ సందర్భంగా కేటీఆర్‌ కోరారు.

ఓటర్లను కూడా ఇలాంటి స్కామర్స్‌ బారి నుంచి కాపాడాలని తెలిపారు. ప్రసుత్తం దేశవ్యాప్తంగా డీప్‌ ఫేక్‌ కంటెంట్‌ గురించి చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం కూడా దీని గురించి హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా కేటీఆర్‌ కూడా దీని గురించి మాట్లాడటం ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

ఇక తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి పార్టీలన్ని ఎలక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ తరపున ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీష్‌రావులు ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి కీలక నేతలతో పాటు రాష్ట్ర నేతలు కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక బీజేపీ తరఫున ప్రధాని మోదీ, అమిత్‌ షా రంగంలోకి దిగారు. ఇక ప్రధాన నేతలంతా రంగంలోకి దిగడంతో.. ప్రచార పర్వం మరింత వేడెక్కుతోంది.

తెలంగాణలో నవంబరు 15తో నామినేషన్ల పర్వం ముగిసింది. నవంబరు 30న పోలింగ్ జరగనుంది. ఇక డిసెంబరు 3న కౌంటింగ్ నిర్వహించి.. అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాంలో కూడా ఎన్నికలు జరగుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా లోక్‌సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. మరి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి