iDreamPost

ప్రభుత్వం కీలక నిర్ణయం.. డ్రైవర్లకు ఉచితంగా టీ.. ఎందుకంటే?

దేశంలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరగడం.. పదుల సంఖ్యల్లో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఈ ప్రమాదాలకు కారణం డ్రైవర్ల నిద్రలేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగం అంటున్నారు పోలీసులు.

దేశంలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరగడం.. పదుల సంఖ్యల్లో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఈ ప్రమాదాలకు కారణం డ్రైవర్ల నిద్రలేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగం అంటున్నారు పోలీసులు.

ప్రభుత్వం కీలక నిర్ణయం.. డ్రైవర్లకు ఉచితంగా టీ.. ఎందుకంటే?

ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోడ్డుపైకి వచ్చిన వాళ్లు క్షేమంగా ఇంటికి వెళ్తారా? లేదా ? అన్న భయం నెలకొంది. ఈ ప్రమాదాలకు కారణం డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, డ్రైవింగ్ పై పూర్తిగా అవగాహన లేకపోవడం ఇవన్నీ ఒక ఎత్తైతే.. చాలా వరకు ట్రాన్స్ పోర్టు రాత్రి పూట జరగడం వల్ల సరైన నిద్ర లేకపోవడం వల్లతో నిద్రమత్తులో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఎక్కువ దూరం ప్రయాణం చేయడం వల్ల డ్రైవర్లు అలసిపోయి నిద్రమత్తులోకి జారడం.. రెప్పపాటున ప్రమాదాలు జరగడం వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు బలి అవుతున్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ అది ఏ రాష్ట్రం.. ఆ నిర్ణయం ఏంటీ అనే దానికి గురించి తెలుసుకుందాం.

రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఒడిశా ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. హైవేల పక్కన ఉన్న దాబాలు, హూటళ్లలో లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ అందించాని ప్రభుత్వం సూచించింది. డ్రైవర్లు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించడం వల్ల నిద్రమత్తులో చేస్తున్న ప్రమాదాలు ఎంతోమంది ప్రాణాలను తీస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకే ఒడిశా సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రాత్రి 3 గంటల నుంచి తెల్లవారు జామున 6 గంటల వరకు డ్రైవర్లకు ఫ్రీ చాయ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి టుకుని సాహు గురువారల తెలిపారు.

ఈ మధ్య కాలంలో హైవేలపై ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి పూట ప్రయాణం అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. టూవీలర్, ఫోర్ విలర్ వాహనాలు హైవే పై వెళ్తుంటే.. చాలా వరకు లారీ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎన్నో ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఒడిశా సర్కార్ ఇలాంటి ఓ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టుంది. దీని వల్ల డ్రైవర్లు రాత్రి సమయంలో కాస్త అలర్ట్ గా ఉంటారని ప్రభుత్వ ఉద్దేశ్యం అని తెలిపింది. ఒడిశాలో 30 జిల్లాల్లో లారీ టెర్మినల్స్ ఏర్పాటు చేస్తున్నామని.. అందులో లారీ డ్రైవర్లు స్నానం చేయడానికి, నిద్రపోవడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయని వెల్లడించింది. ఏది ఏమైనా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై లారీ డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి