iDreamPost

హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. 5 రోజుల పాటు ఆ మార్గాల్లో ఆంక్షలు..!

తరచూ హైదరాబాద్ లో ప్రజలకు ట్రాఫిక్ అలర్ట్ వస్తూనే ఉంటుంది. ప్రత్యేక సందర్భాలు, పండగల నేపథ్యంలో నగరంలోని కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. తాజాగా కూడా ఐదు రోజుల పాటు ఆ రూట్లలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.

తరచూ హైదరాబాద్ లో ప్రజలకు ట్రాఫిక్ అలర్ట్ వస్తూనే ఉంటుంది. ప్రత్యేక సందర్భాలు, పండగల నేపథ్యంలో నగరంలోని కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. తాజాగా కూడా ఐదు రోజుల పాటు ఆ రూట్లలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.

హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. 5 రోజుల పాటు ఆ మార్గాల్లో ఆంక్షలు..!

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా  చెప్పనక్కర్లేదు. నిత్యం అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా ఉంటుంది. పెరుగుతున్న నగర జనాభా కారణంగా ఇలాంటి సమస్యలు పెరుగుతుంటాయి. ఇదే సమయంలో ప్రభుత్వాలు కూడా అనేక చర్యలు తీసుకుంటాయి. ఇలానే పలు సందర్భాల్లో పోలీసులు నగర వాసులకు ట్రాఫిక్ అలెర్ట్ ఇస్తుంటారు. వివిధ పండగలు, ఇతర పర్వదినాల సందర్భాల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. తాజాగా కూడా భాగ్యనగర వాసులకు పోలీసులు ట్రాఫిక్ అలర్ట్ ప్రకటించారు. ఐదు రోజుల పాటు  కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిచారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సోమవారం నుంచి  హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఐదు రోజు పాటు జరిగే ఈ టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.  క్రికెట్ జరగనున్న నేపథ్యంలో ఆయా మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మ్యాచ్ వీక్షించేందుకు క్రికెట్ ఫ్యాన్స్ స్టేడియంకు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఈక్రమంలో ప్రేక్షకులను సోమవారం ఉదయం 6.30 గంటలకే స్టేడియం లోపలికి అనుమతించనున్నారు.

ఈ మ్యాచ్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్, పోలీసు శాఖలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. స్టేడియం చుట్టూ 360 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మొత్తం 1500 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఇదే సమయంలో పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ మీద కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మ్యా చ్ జరిగే స్టేడియం ఉండేది ప్రధాన రహదారి కావటంతో.. ఉప్పల్ ప్రాంతంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాన కూడళ్లు, ప్రధాన మార్గాలు, స్టేడియం వైపు వచ్చే రూట్లల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు. ఈ పరిధిలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు 250 మంది ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.

ఉప్పల్ ఎక్స్ రోడ్స్, స్ట్రీట్ నెం.8 జంక్షన్. హబ్సిగూడ జంక్షన్, ఏక్ మినార్ మసీదుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. పార్కింగ్ స్థలాలను సూచించేందుకు రోడ్ల వెంట సూచిక బోర్డులు, లోకేషన్ మ్యాప్‌లను ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియం వైపు వెళ్లే రూట్లలోనూ దారి మళ్లింపులను సూచించేలా బోర్డులను ఏర్పాటు చేశారు. ఇండియా, ఇంగ్లాడ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగే 5 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన పోలీసులు తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి సహకరంచాలని కోరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి