iDreamPost

కాస్త ఓపిక పట్టాల్సింది.. లేదంటే ఇలా జరిగేది కాదేమో!

  • Author ajaykrishna Updated - 11:17 AM, Thu - 12 October 23
  • Author ajaykrishna Updated - 11:17 AM, Thu - 12 October 23
కాస్త ఓపిక పట్టాల్సింది.. లేదంటే ఇలా జరిగేది కాదేమో!

ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ ని బాగా ఫాలో అవుతున్నారు మేకర్స్. జనరల్ గా విడుదలైన సినిమాలు థియేటర్స్ లో ఎలా పెర్ఫార్మన్స్ చేశాయి అనే పాయింట్ బట్టి.. తదుపరి నిర్ణయం తీసుకోవడం ఒక పద్ధతి. ముందు ఒకటి సక్సెస్ అయితేనే కదా.. నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఛాన్స్ దొరికేది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అలా జరగడం లేదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్న చందంగా నడుస్తోంది. ఏంటి సామెత కూడా చెప్పారంటే.. అంత పెద్ద మ్యాటర్ ఉందా? అనంటే.. అవును ఉంది. బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు చూస్తే ఎవరికైనా ఏం అనిపిస్తుంది. అరే చాలా గొప్పగా తీశారు. ఇలాంటి సినిమాలకు కొనసాగింపు ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది.

అలాంటి ఫీల్ ని రీసెంట్ గా ఏ సినిమా కలిగించింది. ముఖ్యంగా టాలీవుడ్ లో.. బిగ్ రేంజ్ లో బిజినెస్ జరుపుకున్న సినిమాలు ముందే సీక్వెల్స్ అనౌన్స్ చేసేస్తున్నాయి. ఈ విషయం అందరికీ తెలుసు. కొన్ని సినిమాలు మొదటి పార్ట్ ప్రమోషన్స్ లో దీనికి సీక్వెల్స్ కూడా ఉన్నాయని హింట్ ఇచ్చేస్తున్నాయి. ఇంకొన్ని.. థియేటర్స్ కి వెళ్లి సినిమా చూశాక.. ఎండింగ్ కార్డు టైమ్ లో సీక్వెల్ ఉందని చెప్పి వదిలేస్తున్నారు. సీక్వెల్స్ పై ఇంటరెస్ట్ రావాలంటే.. ముందుగా రిలీజ్ అయిన సినిమా పెర్ఫార్మన్స్ ఎలా ఉందనేది దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ సినిమాని జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారు..? దానికి సీక్వెల్ వస్తే బాగుంటుందా లేదా? అనేది పూర్తిగా సినిమా థియేటర్స్ లో చూపించిన ఇంపాక్ట్ బట్టి ఉంటుంది.

రీసెంట్ గా సెప్టెంబర్ ఎండింగ్ లో విడుదలైన క్రేజీ మూవీస్ స్కంద, పెదకాపు 1. రామ్ పోతినేని – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన స్కంద.. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. కట్ చేస్తే.. ఫలితం నిరాశకు గురిచేసిందని ట్రేడ్ వర్గాలు తేల్చేసాయి. మరోవైపు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన పెదకాపు 1. ఈ సినిమాపై ముందునుండి చాలా నమ్మకంగా ఉన్నారు. తీరా రిలీజ్ అయ్యాక ఫలితం నష్టాలు మిగిల్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సో.. వీటి పెర్ఫార్మన్స్ బట్టి కాకుండా ముందుగానే సీక్వెల్స్ ఉన్నాయని అనౌన్స్ చేశారు. ఇప్పుడు రిజల్ట్ చూశాక సీక్వెల్స్ క్యాన్సల్ అని టాక్ నడుస్తుంది. సో.. ముందే కాకుండా ఫలితం బట్టి అనౌన్స్ మెంట్స్ చేస్తే బాగుంటుందని ఆడియన్స్, ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి సీక్వెల్స్ ట్రెండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి