iDreamPost

పరిష్కారం కోసం టాలీవుడ్ ముందడుగు

పరిష్కారం కోసం టాలీవుడ్ ముందడుగు

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నాని చిరంజీవి ఇంటికి వెళ్లి ఈ నెలాఖరులోగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ఆహ్వానించడం ఇప్పటికే చర్చల్లో నిలిచింది. ఏపిలో నెలకొన్న థియేటర్ల సమస్యలు, టికెట్ రేట్ల ఇబ్బందులు తదితరాల గురించి గత నెల రోజులకు పైగా సందిగ్దత నెలకొన్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ నుంచి అమలులోకి వచ్చిన జిఓ ప్రకారం సినిమా టికెట్ ధర మరీ కనిష్ట స్థాయిలో ఉండటం పట్ల ఎగ్జిబిటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగానే చాలా చోట్ల ఇంకా సింగల్ స్క్రీన్లు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. ఈ క్రమంలోనే ఏపి గవర్నమెంట్ నుంచి ఆహ్వానం అందింది

సిఎం జగన్ ని కలిసినప్పుడు ఏ అంశాలు మాట్లాడాలి అనే దాని మీద ఇవాళ చిరంజీవి ఇంట్లో ఇండస్ట్రీ పెద్దలందరూ సమావేశమయ్యారు. నాగార్జున, దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, వివి వినాయక్, మెహర్ రమేష్, ఆర్ నారాయణమూర్తి, సునీల్ నారంగ్, స్రవంతి రవి కిషోర్, కె ఎస్ రామారావు, సుప్రియ, కొరటాల శివ, సి కళ్యాణ్, ఎన్వి ప్రసాద్, ఇతర డిస్ట్రిబ్యూటర్ల ప్రతినిధులు దీనికి హాజరయ్యాయి. ఫోటోలు బయటికి వచ్చాయి కానీ మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారు అనే దాని మీద పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సిఎం జగన్ తో సమావేశంలో ముందుగా దేనికి ప్రాధాన్యం ఇవ్వాలనే దాని మీదే డిస్కషన్ జరిగినట్టు సమాచారం

ప్రస్తుతానికి థర్డ్ వేవ్ గండం లేకపోవడంతో పాటు జనం ఎప్పటిలాగే థియేటర్లు వస్తుండటంతో మళ్ళీ మంచి రోజులు వచ్చాయని నిర్మాతలు ఆనందంగా ఉన్నారు. ఎస్ఆర్ కళ్యాణ మండపంతో మొదలుపెట్టి పాగల్ దాకా టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. ఒకవేళ యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చే సినిమా ఏదైనా పడితే మాత్రం మునుపటిలా రోజుల తరబడి హౌస్ ఫుల్ బోర్డులు చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే జగన్ తో అపాయింట్ మెంట్ ఎప్పుడు అనేది మాత్రం బయటికి చెప్పలేదు. ఆగస్ట్ చివరి వారంలోనే ఉండొచ్చు. బృందంలో ఎవరుండాలి అనేదాని మీద ఒక అవగాహనకు వచ్చినట్టు వినికిడి

Also Read : అన్ని బాషల పరిశ్రమలూ ఆ ఫలితం కోసం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి