అన్ని బాషల పరిశ్రమలూ ఆ ఫలితం కోసం

By iDream Post Aug. 16, 2021, 06:50 pm IST
అన్ని బాషల పరిశ్రమలూ ఆ ఫలితం కోసం

టాలీవుడ్ లో ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు గంపగుత్తగా వస్తున్నాయి కానీ నిజానికి దేశంలో వేరే ఎక్కడా ఏ భాషలోనూ కనీస రిలీజులు లేవన్నది నిజం. చాలా చోట్ల ఎన్నో రాష్ట్రాల్లో ఇంకా థియేటర్లు కూడా తెరుచుకోలేదు. అందుకే ఇప్పుడు అందరి చూపు 19న విడుదల కాబోతున్న అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ మీద ఉంది. సెకండ్ లాక్ డౌన్ తర్వాత భారీ ఎత్తున అత్యధిక స్క్రీన్లలో రాబోతున్న స్టార్ హీరో మూవీ ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మహారాష్ట్రలో పరిస్థితి కుదుటపడనప్పటికీ నిర్మాతలు రిస్క్ చేస్తున్నారు.

ఇప్పటికే ట్రైలర్ మంచి ఆసక్తిని రేపగా రీ ఓపెన్ కి ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్సే బెస్ట్ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది లక్ష్మి బాంబ్ ని ఓటిటికి ఇవ్వడం ద్వారా విమర్శలను అందుకున్న అక్షయ్ కుమార్ ఈసారి అందరికంటే ముందుగా చొరవ తీసుకుని థియేట్రికల్ రిలీజ్ కు ముందుకు రావడం విశేషం. బెల్ బాటమ్ కన్నా ఎప్పుడో పూర్తయిన సూర్య వంశీ మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కబెడుతోంది. ఇండియా మొదటి వరల్డ్ కప్ విక్టరీ రూపొందిన 83 కూడా ల్యాబులోనే మగ్గుతోంది. ఈ నేపథ్యంలో బెల్ బాటమ్ కు వచ్చే రెస్పాన్స్ చాలా కీలకంగా మారబోతోంది. అప్పుడు మిగిలినవి రిలీజ్ కు సై అంటాయి.

ఇప్పటి థియేటర్ల పరిస్థితి చూస్తే కేరళ, తమిళనాడులో ఇంకా వాటి గేట్లు తెరుచుకోలేదు. ఢిల్లీలాంటి ప్రధాన నగరాల్లోనూ పరిమిత సంఖ్యతో నడుపుతున్నారు. బెంగుళూరులో కేవలం ఒక్క కొత్త కన్నడ సినిమా మాత్రమే ఆడుతోంది. మిగిలినవన్నీ తెలుగు, ఇంగ్లీష్ వే. అందుకే బెల్ బాటమ్ ని కనివిని ఎరుగని రేంజ్ లో ఎక్కువ స్క్రీన్లు ఇచ్చేశారు. తెలంగాణ, ఏపిలోనూ మంచి విడుదల దక్కుతోంది. అయితే అదే రోజు ఏకంగా ఆరు సినిమాలు రాబోతుండటంతో పోటీ ఉండబోతోంది. సో ఇప్పుడు బెల్ బాటమ్ రిజల్ట్ మీద మొత్తం ఇండస్ట్రీ కన్నేసింది. ఇది కనక హిట్ అయితే మునుపటి కళ వచ్చేందుకు ఎక్కువ రోజులు పట్టవు

Also Read : డబల్ లాభాలొచ్చేశాయి - ఇక ఓటిటికే ?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp