iDreamPost

క్రెడిట్, డెబిట్ కార్డులు హోల్డర్లకు శుభవార్త – ఇక వాళ్ళు మీ డేటాను తీసుకోలేరు

క్రెడిట్, డెబిట్ కార్డులు హోల్డర్లకు శుభవార్త – ఇక వాళ్ళు మీ డేటాను తీసుకోలేరు

మీరు క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా? ఆన్ లైన్లో తరచూ కొనుగోళ్ళు చేస్తున్నారా?? అయితే ఈ శుభవార్త మీకోసమే. ఆర్బీఐ ప్రవేశపెట్టిన తాజా నిబంధన ఎంతోమందికి భద్రతతో పాటు ఊరటను కలిగిస్తుంది.

కస్టమర్ల భద్రతే లక్ష్యంగా ఆర్బీఐ టోకనైజేషన్ నిబంధనలను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం కస్టమర్ల డేటాను వ్యాపారులు తమ సర్వర్లలో నిల్వ చేయడాన్ని నిషేధించింది. జూలై 1, 2022 నుండి దీన్ని అమలు చేయాల్సిందిగా నిర్ణయించింది ఆర్బీఐ.

ఈ నిబంధన అమల్లోకి వస్తే కస్టమర్ లు సురక్షితమైన లావాదేవీలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎన్ క్రిప్ట్ చేసిన సమాచారం ”టోకెన్” రూపంలో స్టోర్ చేయబడుతుంది. ఈ సమాచారం బయటకు తెలియకుండానే పేమెంట్ జరుగుతుంది. ఇక  జూలై 1, 2022 నుండి, వ్యాపారులు తమ రికార్డుల నుండి ఖాతాదారుల డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల డేటాను తొలగించాల్సి ఉంటుంది.

కార్డ్ టోకెనైజేషన్ సిస్టమ్ తప్పనిసరి కాదు. సాధారణంగా ఒక కస్టమర్ తన కార్డు టోకెనైజేషన్ సమ్మతిని ఇవ్వనట్లయితే, ఆన్ లైన్ పేమెంట్ చేసే ప్రతిసారీ కార్డు వెరిఫికేషన్ వాల్యూ లేదా సివివిని ఎంటర్ చేయడానికి బదులుగా పేరు, కార్డ్ నెంబరు మరియు కార్డ్ వాలిడిటీ వంటి అన్ని వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ టోకెనైజేషన్ కు కస్టమర్ అంగీకరించినట్లయితే, లావాదేవీలు చేసే సమయంలో సి.వి.వి లేదా వన్ టైమ్ పాస్ వర్డ్ వివరాలను మాత్రమే ఇస్తే సరిపోతుంది. టోకెనైజేషన్ సిస్టమ్ పూర్తిగా ఉచితం. ఇది అత్యంత సులభమైన పేమెంట్ అనుభవాన్ని అందిస్తుంది. అయితే ఈ టోకెనైజేషన్ దేశీయ ఆన్లైన్ లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుందిని గమనించాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి