iDreamPost

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు! 30 మంది..

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు! 30 మంది..

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపం, ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది అమాయాకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాక మరెందరో తీవ్రమైన గాయాలతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. మరికొందరు అయితే ప్రమాదాల్లో కాళ్లు, చేతులు కోల్పోయి..జీవితమంతా నరకం చూస్తున్నారు. తాజాగా తమిళనాడులో ఘోరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందగా 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తమిళనాడు రాష్ట్రంలోని తెన్ కాశి ప్రాంతానికి చెందిన 54 మందితో శనివారం ఊటీ యాత్రకు బస్సు బయలుదేరింది.  బస్సులోని టూరిస్టులు అందరూ పరిసర ప్రాంతాలను చూస్తూ తెగ ఎంజాయ్ చేశారు. అయితే తమ ఆనందం కాసేపట్లో విషాదం మారనుందని గ్రహించలేక పోయారు. వారు ప్రయాణిస్తున్న బస్సు నీలగిరి జిల్లాలోని కున్నూర్-మేట్టుపాలయం కొండమార్గంలో ప్రమాదానికి గురైంది. ఈ మార్గంలోని కొయ్య వంతెన సమీపంలో అదుపుతప్పి బస్సు లోయలో పడింది.  ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ముప్పుడాది(67), మురుగేశన్(65), దేవిక(42), ఇళంగో(64), కౌసల్య(29), సెల్వన్(15), నితిన్ తో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లుగా పోలీసులు గుర్తించారు.

అంతేకాక మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సమచారం అందించడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.  ప్రమాదంలో చిక్కుకున్న వారిని బయటికి తీసే పనుల్లో నిమగ్నమయ్యారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం కోవై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్థాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలానే  మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలానే తీవ్ర గాయాల పాలైనవారికి రూ. లక్ష, స్వల్పంగా  గాయాలైన వారికి రూ.50 వేలు  సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అందించనున్నట్లు తెలిపారు. మరి.. ఘోర ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి