iDreamPost

ఈనాడు భవనంపై నుంచి పడి మహిళ ఉద్యోగిని మృతి!

నిత్యం చాలా మంది వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకుంటారు. అలానే మరికొందరు అనుమానస్పద స్థితిలో మరణిస్తూ ఉంటారు. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ మహిళా ఉద్యోగి ఈనాడు ఆఫీస్ భవనం పై నుంచి పడి మృతి చెందింది.

నిత్యం చాలా మంది వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకుంటారు. అలానే మరికొందరు అనుమానస్పద స్థితిలో మరణిస్తూ ఉంటారు. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ మహిళా ఉద్యోగి ఈనాడు ఆఫీస్ భవనం పై నుంచి పడి మృతి చెందింది.

ఈనాడు భవనంపై నుంచి పడి మహిళ ఉద్యోగిని మృతి!

హైదరాబాద్ నగరంలోని  రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ మహిళ అనుమానస్పదంగా మృతి చెందింది. ఫిల్మ్ సిటిలోని ఈనాడు ఆఫీస్ లోని నాల్గొవ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసు చేసుకుంది. మృతి చెందిన మహిళ.. ఈనాడు కార్యాలయంలోనే కాల్ సెంటర్ లో పని చేస్తోంది. మృతురాలి భర్త కూడా ఈనాడు సంస్థల్లోనే పని చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు. మహిళ మృతి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళది ఆత్మహత్యా కాదా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ ఇటీవల పలు ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. కొన్ని రోజుల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో  ఓ కార్యక్రమంలో హైడ్రాలిక్ క్రేన్ చైన్ తెగిపోవడంతో ఓ సీఈవో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ఫిల్మ్ సిటీ యాజమాన్యం నిర్లక్ష్యంగా కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని పలువురు వెల్లడించారు. మరుకవ ముందే మరో ఘటన చోటుచేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో పని చేస్తున్నా సాయి కుమారి అనే మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది. ఫిల్మ్ సిటీలోనే ఈనాడు కార్యాలయంలోని నాల్గొవ అంతస్తు నుంచి దూకి చనిపోయారు. యాజమన్యం వేధింపులే  కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇది ఆత్మహత్యనా లేక మరే కారణమైన ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగా కూడా ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఉదయం 8 గంటలకు ఈ ఘటన జరగ్గా చాలా సమయం పాటు బయటకు రాకుండా ఫిల్మ్ సిటీ యాజమాన్యం జాగ్రత్త పడింది. సాయికుమారి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో మీడియాను, ఇతరులను లోపలికి అనుమతించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇలా ఫిల్మ్ సిటీలో ఏం జరిగినా కూడా బయటకు రానివ్వడం లేదనే వార్తలు వినిపిస్తోన్నాయి.  ఈ ఆత్మహత్యకు  సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని మృతురాలి బంధువులు, స్థానికులు డిమాండ్ చేశారు. మరి.. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ తరహా ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి