iDreamPost

భర్త, కూతుళ్లను దారుణంగా కాల్చి చంపిన మహిళ!

ఇటీవల చాలా మంది ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం.. ఎదుటి వారిపై దాడులు చేయడం లాంటి చేస్తున్నారు. కొన్నిసార్లు విచక్షణ కోల్పో సొంతవారినే హత్యలు చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

ఇటీవల చాలా మంది ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం.. ఎదుటి వారిపై దాడులు చేయడం లాంటి చేస్తున్నారు. కొన్నిసార్లు విచక్షణ కోల్పో సొంతవారినే హత్యలు చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

భర్త, కూతుళ్లను దారుణంగా కాల్చి చంపిన మహిళ!

ఈ మద్య చిన్న చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురైతున్నారు. ఆ క్షణంలో విచక్షణ కోల్పోయి ఎదుటివారిపై దాడులు చేయడమే కాదు.. కొన్నిసార్లు హత్యలకు పాల్పపడుతున్నారు. చాలా వరకు మానసిక ఒత్తిడి, వివాహేతర సంబంధాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు అంటున్నారు. తమవారిని కోల్పోయిన ఎన్నో కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయి. ఎంతోమంది పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. ఓ మహిళ తన కుటుంబ సభ్యులను కాల్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని న్యూ జెర్సీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త, ఇద్దరు కూతుళ్లను తల్లి తుపాకీతో దారుణంగా కాల్చి చంపింది. అనంతరం తను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. న్యూ జెర్సీలోని లిన్ క్రెస్ట్ టెర్రస్ లో ఉన్న ఓ ఇంటిలో రుబెన్ అలర్కన్, ఆండ్రియా అలర్కన్ దంపుతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు స్కార్లెట్, ఎమ్మా. తమతో రుబెన్‌ అలర్కన్‌ దంపతులు ఎంతో సంతోషంగా ఉండేవారని.. పిల్లలు చాలా క్యూట్ గా ఉండేవారని.. ఇలాంటి ఘోరం ఎలా జరిగిందో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు.

ఆండ్రియా పక్కనే తుపాకీ ఉండటంతో మొదట భర్త, ఇద్దరు కూతుళ్లను తుపాకీతో కాల్చి చంపింది.. ఆ తర్వాత తనను తాను కాల్చుకొని బలవన్మరణం చేందినట్లు పోలీసులు తెలిపారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అన్న విషయం తెలియదని చెప్పారు. గత ఏడాది నవంబర్ లో జరిగిన వేలంలో ఆండ్రియా అలర్కన్ దంపతులు తమ ఇంటిని కోల్పోయారు. ఈ ఇంటిని ఖాళీ చేయడానికి 60 రోజుల సమయం.. ఈ నెలాఖరలో ముగియనుంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు చనిపోవడం తీవ్ర దగ్బ్రాంతికి గురి చేసింది. ఒకేసారి కుటుంబం మొత్తం చనిపోవడం చాలా బాధాకరం అనిపిస్తుందని యూనియన్ కౌంటీ ప్రాసిక్యూటర్ విలియమ్ డానియల్ అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి