iDreamPost

నిండు గర్భిణి మృతి.. భర్త అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా ట్విస్ట్!

Madhya Pradesh Crime News:ఇటీవల దేశంలో యువత ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. తమ మనసుకు నచ్చిన వారిని ప్రేమించి కొంతకాలం లివింగ్ రిలేషన్ లో ఉండి పెళ్లి చేసుకుంటున్నారు.

Madhya Pradesh Crime News:ఇటీవల దేశంలో యువత ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. తమ మనసుకు నచ్చిన వారిని ప్రేమించి కొంతకాలం లివింగ్ రిలేషన్ లో ఉండి పెళ్లి చేసుకుంటున్నారు.

నిండు గర్భిణి మృతి.. భర్త అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా ట్విస్ట్!

ఈ మధ్య కాలంలో చాలామంది యువత ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇందుకోసం పెద్దలను ఒప్పించి కొందరు.. ఎదరించి కొందరు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ మధ్య ప్రేమ వివాహాలు చేసుకొని కొంతకాలం తర్వాత వరకట్నం కోసం యువతులను వేధించిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. 13 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ నిండు గర్భిణి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ విషయం పోలీసులకు, అత్తమామలకు సమాచారం ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు చేయడానికి సిద్దమయ్యాడు భర్త. అంతలోనే పోలీసులు, అత్తమామలు ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ డియోరీలోని బిచువా నివాసి దీక్షా చాదర్ (22) డిగ్రీ కాలేజ్ లో బీకాం చదువుతుంది. బర్తుమా నివాసి రాజ్ పుత్ర స్వరూప్ పాండేతో ప్రేమలో పడింది. పదమూడు నెలల క్రితం దీక్ష రాజ్ తో పారిపోయి పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే మాక్రోనియాలో అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. ప్రస్తుతం దీక్షా చాదర్ గర్భంతో ఉంది. ఇటీవల భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు కావడంతో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి బాధపడింది దీక్ష. ఆ సమయంలో ఆమెకు సర్ధి చెప్పి అత్తవారింటికి పంపించారు తల్లిదండ్రులు. మంగళవారం రాత్రి దీక్ష తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో మాక్రోనియా మహిళా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి రాయ్ ఆస్పత్రికి తరలించాడు.. అక్కడ దీక్ష మరణించిందని రాజ్ పాండే చెప్పాడు. ఈ క్రమంలోనే గుట్టు చప్పుడు లేకుండా దీక్ష అంత్యక్రియలకు సిద్దమవుతుండగా ఆమె తల్లిదండ్రులు విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు.

రాజ్ పాండే తమ సోదరిని తరుచూ హింసిస్తూ ఉండేవాడని.. బాధతో తమ సోదరి తల్లిదండ్రుల వద్దకు వస్తే ఇంటికి తీసుకువెళ్లి కొట్టేవాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు దీక్ష సోదరులు. దీక్ష సోదరుడు మాట్లాడుతూ.. ‘నా చెల్లెలు దీక్ష చనిపోయిన తర్వాత తమకు కానీ.. పోలీసులకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మృతదేహానికి దహన సంస్కారాలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటీ? అని ప్రశ్నించారు. బుధవారం తమకు తెలియడంతో పోలీసులతో కలిసి బర్దుమా కు బయలుదేరి అంత్యక్రియలు నిలిపివేశాం. మృతిపై వెంటనే విచారణ చేయాలని పోలీసులకు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని జిల్లా ఆస్పత్రిలో పోస్ట్ మార్టానికి తరలించారు’ అని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి