iDreamPost

ఆదిపురుష్‌ బడ్జెట్‌తోనే చంద్రయాన్‌-3 ప్రయోగం.. నేడే నింగిలోకి.. !

ఆదిపురుష్‌ బడ్జెట్‌తోనే చంద్రయాన్‌-3 ప్రయోగం.. నేడే నింగిలోకి.. !

జాబిల్లిపై చెరగని ముద్ర వేయడానికి ఇస్రో రెడీ అయింది.  ఈ అంతరిక్ష ప్రయోగంతో భారత కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచంలో మరింత ఇనుమడింపజేయనుంది. స్వదేశీ పరిజ్ఞానంపై మనకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచే మూన్‌ మిషన్‌కు ఇస్రో సర్వం సిద్ధం చేసింది. అమెరికా, చైనా, రష్యాలకు భిన్నంగా భారత్ చంద్రుడిపైకి వెళ్లనుంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరికి తెలియని నిగూఢ రహస్యాలను ఛేదించేందుకు చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని శుక్రవారం చేపట్టనుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈ ప్రయోగం జరనుంది.

పోయినచోటే వెత్తుకోవాలంటారు మన పెద్దలు. సరిగ్గా అదే పని చేస్తుంది… భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. నాలుగేళ్ల కిందట అంటే.. 2019లో జాబిల్లి కోసం చేసిన ప్రయత్నం విఫలమైంది. తాజాగా ఆ కలను సాకారం చేసుకునేందుకు రెట్టించిన ఉత్సాహంతో  సిద్ధమైంది. అంతరిక్ష పరిశోధన రంగంలో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన ఇస్రో.. చంద్రాయన్-2 ప్రయోగం విఫలం నుంచి పాఠాలు నేర్చుకొని మరింత శక్తిమంతమైన  వ్యోమనౌకతో తాజా ప్రయోగానికి సిద్ధమైంది.  శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్ వీఎం-3  ఎమ్-4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. చంద్రుడిని చేరుకొనేందుకు 40 రోజులు పడుతుంది. అంతాసాఫీగా సాగితే… వచ్చే నెలలో చంద్రయాన్-3 జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద దిగుతుంది. దీంతో ఆ ఘనత సాధించిన తొలి దేశంగా..  చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ ను సాధించిన నాలుగో దేశంగా భారత్  గుర్తింపు పొందనుంది.

ప్రయోగంలో మూడు మాడ్యూల్:

రాకెట్‌ను నింగిలోకి తీసుకుపోయేందు ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ తొలి మెట్టు. ఈ మాడ్యూల్‌.. రాకెట్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టి వేరు పడిపోతుంది. ఇక రెండోవది ల్యాండర్‌ మాడ్యూల్‌.. ఇది చంద్రుడిపైకి రోవర్‌ను మోసుకెళ్లి దించుతుంది. రాకెట్‌ నుంచి విడిపోయిన తర్వాత నిర్ణీత కక్ష్యకు చేరుకొని చంద్రుడివైపు ప్రయాణిస్తుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కి.మీ ఎత్తులో ఉన్న కక్ష్యలోకి చేరుకొంటుంది. దక్షిణ ధ్రువం వద్ద చంద్రుడిపై ల్యాండర్‌ దిగగానే రోవర్‌ బయటకు వస్తుంది. ఇక మూడోవది మాడ్యూల్ పేరు రోవర్‌. ఇది చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు రూపొందించిన పరికరము. ఇది చందమామపై ఉన్న మట్టి, మంచును, వాతావరణాన్ని పరిశీలించి సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది.

చంద్రుడిపై ఇప్పటివరకు అమెరికా, చైనా, రష్యా మాత్రమే విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ ను సాధించాయి. చంద్రయాన్‌-3 విజయవంతం అయితే నాలుగో దేశంగా భారత్‌ చరిత్ర సృష్టిస్తుంది. అమెరికా, రష్యా, చైనాలు చంద్రుడిపై ప్రయోగం కోసం వేల కోట్లు ఖర్చు చేశాయి. ఇస్రో మాత్రం దాదాపు ఐదారు వందల కోట్ల బడ్జెట్‌తోనే ఇంతటి ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపడుతున్నది. చంద్రయాన్‌-3కి రూ.650 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇది ఇటీవల విడుదలైన ఆదిపురుష్‌ సినిమా బడ్జెట్‌కు సమానమని కొందరు అంటున్నారు. అంటే ఒక భారీ చిత్రం  నిర్మిచే బడ్జెట్ తో దేశానికి ఉపయోగడే ఇలాంటి ప్రయోగం కూడా చేయవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి.. చంద్రయాన్-3 విజయవంతం కావాలని మీరందరు కోరుకుంటా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి