iDreamPost

మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

పసిడి ధరలు మార్కెట్ లో ఏ క్షణంలో పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు జ్యులరీ షాపులకు ఎగబడుతున్నారు.

పసిడి ధరలు మార్కెట్ లో ఏ క్షణంలో పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు జ్యులరీ షాపులకు ఎగబడుతున్నారు.

మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

దేశంలో కొంతకాలంగా మహిళలు బంగారు ఆభరణాలు కొనుగులో ఎక్కువ అయ్యింది. పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు మహిళలు పసిడి కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే బంగారంపై ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏదైనా ఆపద సమయంలో తమను ఆదుకుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే ధరలు హెచ్చు తగ్గులు అయినా పట్టించుకోకుండా బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బంగారానికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. గత నెలలో గరిష్టంగా పెరిగిన బంగారం ధరలు.. వారం రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పట్టినా.. మరోసారి షాక్ ఇచ్చింది. నేడు మార్కెట్ లో బంగారంధరల విషయానికి వస్తే..

మార్కెట్ లో పసిడి ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి. అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడుతున్న మార్పుల ప్రభావం బంగారంపై పడుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ వడ్డీ ధరల్లో తరుచూ ఏర్పడుతున్న మార్పుల వల్ల పసిడి ధలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఏది ఏమైనా ధరలు తగ్గుముఖం పట్టినపుడు వెంటనే కొనుగోలు చేయడం బెటర్ అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధరల ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 57,400 గా ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.  62,620 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ.80,000 వద్ద ట్రెండ్ అవుతుంది.

gold rates increased

దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల విషయానికి వస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,550 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,770 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,400 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,620 వద్ద కొనసాగుతుంది. కోల్‌కతా, బెంగళూరులో పసిడి ధరలు చూస్తే.. 22 క్యారెట్ల గోల్డ రేట్ రూ. 57,400గా ఉండగా, 24 క్యారెట్ల పసిడి రూ. 62,620 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,850గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 63,110 వద్ద కొనసాగుతుంది. ప్రధాన నగరాల్లో వెండి ధరలు.. ముంబై తో పాటు పూణె, జైపూర్, కోల్ కోతా, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 78,000 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి