iDreamPost

Gold Rates: పసిడి ప్రియులకు భారీ ఊరట.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. దీంతో మహిళలు ఎక్కువగా పసిడి కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇటీవల బంగారం ధరలు తరుచూ పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి.

దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. దీంతో మహిళలు ఎక్కువగా పసిడి కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇటీవల బంగారం ధరలు తరుచూ పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి.

Gold Rates: పసిడి ప్రియులకు భారీ ఊరట.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

ఇటీవల కాలంలో దేశంలో పసిడి కొనుగోలు రోజు రోజు కీ పెరిగిపొతూనే ఉంది. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు బంగారు ఆభరణాలు కొనేందుకు మహిళలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈక్రమంలోనే బంగారం దిగుమతులు బాగా పెరిగిపోయాయి.. దీంతో పాటు డిమాండ్ కూడా భారీగా పెరిగిపోతూ వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడే మార్పుల ప్రభావం ఎక్కువగా బంగారం పై పడుతుంది. గత నెలలో గరిష్టంగా పెరిగిన బంగారం ధరలే ఈ నెలలో కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆదివారం తులం బంగారం పై ఒకేసారి రూ.400 వరకు తగ్గింది. ఇదే ధర సోమవారం కూడా స్థిరంగా కొనసాగుతుంది. నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరల విషయానికి వస్తే..

దేశంలో బంగారం కొనుగోలు ఎక్కువైంది.. దానికి తగ్గట్టు దిగుమతులు కూడా బాగా పెరిగిపోయాయి. గత రెండు నెలలు గా మార్కెట్ లో బంగారం చుక్కలు చూపించింది. ఈ మద్య కాస్త తగ్గుముఖం పట్టింది. అలాగే వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. ఇటవల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ వడ్డీ రేట్లలో వస్తున్న స్వల్ప మార్పుల ప్రభావం వల్ల బంగారం, వెండి ధరలు కాస్త ఊరట కల్పిస్తున్నాయి. ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయడం చాలా వరుకు మంచిదని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంతో బంగారం ధరలు పోల్చుకుంటే ఇప్పుడు మహిళలకు ఊరట కలిగిస్తున్నాయని.. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి జ్యులరీ షాపులకు క్యూకడుతున్నారని వ్యాపారులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం, వెండి ధరల విషయానికి వస్తే.. 2 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 57,300 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 62,510 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ప్రస్తుతం రూ.79,700 వద్ద ట్రెండ్ అవుతుంది.

gold rates reduced

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల విషయానికి వస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 57,450 గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,660 వద్ద కొనసాగుతుంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,300 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,510 వద్ద కొనసాగుతుంది. కోల్‌కతా, బెంగళూరులో బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 57,300 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 62,510 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,900 గా ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,160 వద్ద ట్రెండ్ అవుతుంది. కోల్ కోతా, ఢిల్లీ, ముంబై లో నేడు కిలో వెండి ధర రూ. 77,700 వద్ద కొనసాగుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి