iDreamPost

మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

ఇటీవల దేశంలో బంగారం కొనుగోలు విపరీతంగా పెరిగిపోతుంది. దానికి తగ్గట్టుగానే ధరలు కూాడా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడుతున్న మార్పులు ఎక్కువగా బంగారం ధరలపై పడుతుంది.

ఇటీవల దేశంలో బంగారం కొనుగోలు విపరీతంగా పెరిగిపోతుంది. దానికి తగ్గట్టుగానే ధరలు కూాడా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడుతున్న మార్పులు ఎక్కువగా బంగారం ధరలపై పడుతుంది.

మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

ఇటీవల బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి.. ఒక్కసారే పెరిగిపోతున్నాయి. కానీ బంగారం డిమాండ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. బంగారం అంటేనే భరోసా.. ఏ ఆపద సమయంలో అయినా సరే ఉపయోగపడుతుంది. అందుకే తమ వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్ములనైనా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక బంగారు వ్యాపారులు భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని వీటిపై పెట్టుబడులు పెడుతూ ఉంటారు. కాకపోతే ఇటీవల మార్కెట్ లో తరుచూ బంగారం ధరల్లో మార్పులు చేర్పులు వస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్, కార్తీక మాసం కావడంతో బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. గత ఆరు రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. నేడు మార్కెట్ లో బంగారం ధరల విషయానికి వస్తే..

సాధారణంగా భారత దేశంలో మహిళలు బంగారం అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. పండుగలు, వివాహాది శుభకార్యాలకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఇక కార్తీక మాసంలో అయితే జ్యూలరీ షాపులు కిట కిటలాడుతుంటాయి. ఇటీవల బంగారం ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కానీ ఈ ఏడాది చివరి వరకు తులం 65 వేల వరకు చేరే అవకాశం ఉండొచ్చు అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకే కొంతమంది వ్యాపారులు తమ వద్ద ఉన్న డబ్బు ఎక్కువగా బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇటీవల ఇజ్రయెల్, పాలస్థినాల మధ్య నెలకొన్న యుద్దం కూడా బంగారం పెరుగుదలకు ఒక కారణం అని అంటున్నారు ఆర్థిక నిపుణులు. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరల విషాయినికి వస్తే.. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ పట్నం లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,600 వద్ద ట్రెండ్ అవుతుంది.

దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,750 వద్ద కొనసాగుతుంది. ముంబై, బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.60,600 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,090 వద్ద కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర విషయానికి వస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 76,000 వద్ద కొనసాగుతుంది. చెన్నై లో కిలో వెండి రూ. 76,000 వద్ద ట్రెండ్ అవుతుంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 73,000 ఉండగా, బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 76,000 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి