iDreamPost

కార్తీక మాసానికి ముందు దిగివచ్చిన పసిడి.. ధర ఎంతంట?

  • Published Nov 13, 2023 | 10:46 AMUpdated Nov 13, 2023 | 10:46 AM

ఇటీవల బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అన్న అయోమయంలో పడిపోతున్నారు కొనుగోలుదారులు.

ఇటీవల బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అన్న అయోమయంలో పడిపోతున్నారు కొనుగోలుదారులు.

  • Published Nov 13, 2023 | 10:46 AMUpdated Nov 13, 2023 | 10:46 AM
కార్తీక మాసానికి ముందు దిగివచ్చిన పసిడి.. ధర ఎంతంట?

ప్రంపంచంలో బంగారం అంటే ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడుతుంటారు. ఇటీవల బంగారం ధరలు పెరుగుతూ,, తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొంటున్న అనిశ్చితి వల్ల పసిడి ధరల్లో తరుచూ మార్పులు సంభవిస్తున్నాయి. దానికి తోడు ఇటీవ ఇజ్రాయెల్-పాలస్థినా ల మధ్య యుద్దం కూడా ఒక కారణం అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. సెప్టెంబర్ లో తగ్గిన బంగారం అక్టోబర్ లో చుక్కలనంటింది. ఈ నెల ప్రారంభంలో పెరిగిన బంగారం గత ఆరు రోజుల నుంచి తగ్గుముఖం పట్టింది. మార్కెట్ లో బంగారం ధర ఎంతంటే…

ఇటీవల ప్రపంచంలో మార్కెట్ వ్యవస్థలో ఏర్పడుతున్న అనూహ్యమైన మార్పుల వల్ల బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో అన్న విషయంలో కొనుగోలుదారులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారు ఆభరణాల కొనుగోలు పెరిగిపోయింది. ఇక రాబోయే కార్తీక మాసంలో కూడా పలు శుభకార్యాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే బంగారు ప్రియులకు కాస్త ఉరట కలిగిస్తూ.. స్వల్పంగా ధరలు తగ్గాయి. ఇరే పసిడి కొనుగోలు చేయడానికి మంచి తరుణం అని నిపుణులు అంటున్నారు.

నేడు మార్కెట్ లో బంగారం ధరల విషాయినికి వస్తే.. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55, 540 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 69, 590 వద్ద ట్రెండ్ అవుతుంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 55,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములు గోల్డ్ రేటు రూ. 60,740 వద్ద ట్రెండ్ అవుతుంది. కోల్ కతా, బెంగళూరు, ముంబై నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసడి ధర రూ. 55,540 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,590 కు చేరింది. ఇక తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, విశాఖ, విజయవాడ లో కిలో వెండి ధర రూ. 76,000 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, కోల్ కొతాలో కిలో వెండి ధర కిలో రూ.73,000 కు చేరింది. చెన్నైలో రూ.76,000 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.71,750 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి