iDreamPost

Today Gold Rate: బంగారం కొనాలనుకువారికి షాక్‌.. ఒక్క రోజే భారీగా పెరిగిన ధర

  • Published Dec 15, 2023 | 8:23 AMUpdated Dec 15, 2023 | 9:32 AM

గత కొన్ని రోజులుగా దిగి వస్తూ ఊరట కలిగిస్తోన్న బంగారం ధర నేడు మాత్రం భారీగా పెరిగి ఒక్క సారిగా షాక్‌ ఇచ్చింది. వెండి రేటు కూడా వేలల్లో పెరిగింది. ఆ వివరాలు..

గత కొన్ని రోజులుగా దిగి వస్తూ ఊరట కలిగిస్తోన్న బంగారం ధర నేడు మాత్రం భారీగా పెరిగి ఒక్క సారిగా షాక్‌ ఇచ్చింది. వెండి రేటు కూడా వేలల్లో పెరిగింది. ఆ వివరాలు..

  • Published Dec 15, 2023 | 8:23 AMUpdated Dec 15, 2023 | 9:32 AM
Today Gold Rate: బంగారం కొనాలనుకువారికి షాక్‌.. ఒక్క రోజే భారీగా పెరిగిన ధర

క్రితం సెషన్‌లలో వరుసగా దిగి వచ్చిన బంగార ధర నేడు మాత్రం భారీ షాక్‌ ఇచ్చింది. ఒక్క రోజులోనే ఎవరూ ఊహించని రేంజ్‌లో పెరిగి పసిడి ప్రియులకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. గత కొన్ని రోజులుగా దిగి వస్తోన్న రేటు చూసి.. బంగారం కొనాలనుకు వారు.. నేటి ధర చూసి షాక్‌తో బిగుసుకుపోయారు. అలానే గత కొన్ని రోజులుగా వరుసగా పడిపోతున్న​ వెండి రేటు.. నేడు మాత్రం రాకెట్‌ స్పీడ్‌తో దూసుకుపోయింది. అంతర్జాతీయంగా గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు పెరగడంతో.. ఆ ప్రభావం దేశీయంగా కూడా భారీగానే కనిపించింది. మరి నేడు పుత్తడి ధర ఎంత పెరిగింది.. దేశీయ బులియన్‌ మార్కట్‌లో రేటు ఎలా ఉందంటే..

హైదరాబాద్‌లో గత నాలుగైదు రోజులుగా.. దిగి వచ్చిన బంగాం రేటు నేడు మాత్రం భారీగా పెరిగింది. పది గ్రాముల మీద ఏకంగా 1000 రూపాయలు పెరిగి.. కోలోకోలేని విధంగా షాకిచ్చింది. నేడు భాగ్యనగరంలో ఆభరణాల తయారీకి వినియోగించే పుత్తడి ధర పది గ్రాముల మీద 1000 రూపాయలు పెరిగింది. దాంతో భాగ్యనగరంలో 22 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల రేటు 57,650కి చేరింది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర కూడా భారీగా పెరిగింది. నేడు భాగ్యనగరంలో వ24 క్యారెట్‌ స్వచ్ఛమైన పసిడి ధర పది గ్రాముల మీద రూ.1000 పెరిగి 62,890 రూపాయల వద్ద ట్రేడవుతోందివ.

Gold rate increased by thousands in a single day

ఇక ఢిల్లీ బులియన్ మార్కెట్లో కూడా నేడు బంగారం ధర భారీగా పెరిగింది. ఇవాళ హస్తినలో 22 క్యారెట్‌ బంగారం రేటు 10 గ్రాముల మీద రూ. 1000 పెరిగి రూ. 57, 800 కి చేరింది. అలానే ఇక 24 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ ఢిల్లీలో రూ. 1090 మేర పెరిగి రూ. 63,040 వద్దకు చేరింది.

వెండి రూ. 2500 జంప్..

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. సిల్వర్‌ రేటు ఒక్కసారిగా పెరిగింది. గత వారం రోజుల్లో వెండి ధర కిలో మీద ఏకంగా రూ.5500 మేర దిగి రాగా ఇవాళ ఒక్కసారిగా రూ.2500 మేర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.79,500 స్థాయికి చేరింది. ఇక ఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.2500 పెరిగింది. ప్రస్తుతం హస్తినలో కిలో వెండి రేటు రూ. 75,800 స్థాయికి ఎగబాకింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి