iDreamPost

అష్టాచమ్మ ఆటలో స్నేహితుల మధ్య గొడవ! చివరకు…

అష్టాచమ్మ ఆటలో స్నేహితుల మధ్య గొడవ! చివరకు…

నేటికాలంలో మనిషిలో సహనం అనేది కొరవడింది. అందుకే ప్రతి చిన్న విషయానికి సహనం కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. ఇంకా దారుణం ఏమిటంటో  కొందరు సహనం కోల్పోయి.. తమ స్నేహితుల పైనే దాడికి దిగుతుంటారు. వివిధ రకాల ఆటలు ఆడే సందర్భంలో చిన్నగా మొదలైన గొడవలు.. పెద్దగా మారి.. ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరగ్గా.. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. అష్టాచమ్మ ఆటలో వచ్చిన చిన్నపాటి వివాదం.. ఓ మనిషి ప్రాణం తీసింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

విశాఖపట్నం జిల్లా గవర వీధిలోని ఆటోమోటీవ్ ప్రాంతానికి చెందిన దవిల నారాయణరావు(28), మద్దిలపాలెం పిఠాపురం కాలనీకి చెందిన ఆర్. రాంబాబు(29) స్నేహితులు. పెళ్లైన రాంబాబు డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలానే నారాయణరావు పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. వీరిద్దరు విరామం దొరికిన ప్రతిసారి కలిసి అష్టాచమ్మ ఆట ఆడేవారు. అలానే మంగళవారం మధ్యాహ్నం వీరిద్దరూ పిఠాపురం కాలనీలోని మార్కెట్ సెంటర్ సమీపంలో పందెం పెట్టుకుని అష్టాచమ్మా ఆడారు. చాలా సమయం  పాటు వారి ఆట ప్రశాంతంగా సాగింది. అయితే మధ్యలో వారిద్దరి మధ్య చిన్న గొడవ చోటుచేసుకుంది.  దీంతో అష్టాచమ్మా పిక్కలను నారాయణరావు కాలితో తన్నేశాడు. రాంబాబుకు కోపం వచ్చి నారాయణరావు ముఖంపై బలంగా కొట్టాడు. దీంతో నారాయణరావు ఒక్కసారిగా వెనక్కి పడిపోయాడు.

అక్కడి సిమెంట్ అరుగు నారాయణరావు తల బలంగా తాకడంతో.. అక్కడికక్కడే మృతిచెందారు. ఈ హఠాత్పరిణామంతో భయాందోళనకు గురైన రాంబాబు.. అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలాకి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాంబాబు కోసం గాలిస్తున్నారు. ఓ ఆట విషయంలో తలెత్తిన గొడవ.. ఓ ప్రాణాన్ని బలి తీసుకోవడం దారుణమని స్థానికులు వాపోతున్నారు. నారాయణరావు మృతితో…ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి.. ఇలా ఆట కారణంగా ప్రాణాలు  పోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వృద్ధుడికి వలపు వల.. ఏకంగా 82 లక్షలు దోచేసిన మహిళలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి