iDreamPost

దంపతుల మధ్య ఆన్‌లైన్ బెట్టింగ్ చిచ్చు.. కుటుంబం బలి

  • Published Apr 09, 2024 | 4:00 PMUpdated Apr 09, 2024 | 4:00 PM

తాజాగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఊభిలో చిక్కుకున్న ఓ వ్యక్తి కుటంబంలో తీవ్ర తగాదాలను తీసుకువచ్చింది. చివరికి ఆ ఇంట్లో చిన్న పిల్లాడితో సైతం అందరూ చేసిన పనికి స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.

తాజాగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఊభిలో చిక్కుకున్న ఓ వ్యక్తి కుటంబంలో తీవ్ర తగాదాలను తీసుకువచ్చింది. చివరికి ఆ ఇంట్లో చిన్న పిల్లాడితో సైతం అందరూ చేసిన పనికి స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.

  • Published Apr 09, 2024 | 4:00 PMUpdated Apr 09, 2024 | 4:00 PM
దంపతుల మధ్య ఆన్‌లైన్ బెట్టింగ్ చిచ్చు.. కుటుంబం బలి

ఇటీవల కాలంలో అందరూ ఈజీగా మనీ సంపాదించాడానికి అలవాటు పడ్డారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా లక్షలు, లక్షలు సంపాదించేయాలనే యాతనతో.. ఈ ఆన్ లైన్ గేమ్స్ కు బానిసలు గా మారి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే వీరిలో ఎక్కువ శాతం, క్రికెట్ బెట్టింగ్స్ , రమ్మీ, పబ్జీ వంటి ఆన్ లైన్ గేమ్స్ ఉచ్చులో పడి ఉన్నదంతా పొగొట్టుకోవడం, ఆర్థికంగా వెనకబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అప్పులు చేసి, వాటిని తీర్చే స్తోమత లేక ఆత్మహత్యలు చేసుకుంటూ.. కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. అయితే తాజాగా ఈ ఆన్ లైన్ గేమింగ్ ఉచ్చులో చిక్కుకున్న ఓ వ్యక్తి కుటంబంలో తీవ్ర తగాదాలను తీసుకువచ్చింది. చివరికి ఆ ఇంట్లో చిన్న పిల్లాడితో సైతం అందరూ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనంగా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఊభిలో చిక్కుకున్న మరో కుటుంబం బలైపోయింది.  అయితే ఆన్ లైన్  బెట్టింగ్స్ వలన ఆ కుటుంబంలో తీవ్ర తగదాలు వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ విషాద ఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  చేవెళ్ల మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన ఆనంద్‌ (38) ఇందిర (36) అనే దంపతులకు   శ్రేయాన్స్‌ (4) అనే ఒక కొడుకు ఉన్నాడు. అయితే అనంద్ వృత్తి రిత్యా పాల వ్యాపరం చేస్తుంటాడు. కాగా, ఇతను మూడేళ్ల క్రితం నుంచి బండ్లగూడజాగీర్‌ సన్‌సిటీ ఏరియాలోని యమున అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్నాడు. ఇక పాల వ్యాపారం చేస్తున్నా ఆనంద్ కు ఆన్ లైన్ గేమ్స్‌ కు బానిసగా మారాడు. ఈ క్రమంలోనే  ఇతడు దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులు చేసి, ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో ఈ విషయం పై తరుచు దంపతుల ఇద్దరి మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి.

ఇక వీరి మధ్య వివాదం కాస్తా ఎక్కువవ్వడంతో.. గత 15 రోజుల క్రితం ఇరు కుటుంబాలు, వారితోపాటు స్నేహితులు వచ్చి ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడొద్దని, బుద్ధిగా ఉండి కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పారు. అయినా ఆనంద్‌  ప్రవర్తనలో ఎలాంటి  మార్పు రాలేదు.  పైగా అతడు మూడురోజుల క్రితం మరోసారి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఆడినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సోమవారం ఉదయం నుంచి ఇద్దరి మధ్య  మళ్లి గొడవ జరిగింది. ఇక ఆ సమయంలో ఇందిర తన కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి జరిగిందంతా చెప్పింది.  అలాగే ఆనంద్‌ కూడా తన స్నేహితులతోపాటు బంధువులకు ఫోన్‌ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సమాచారం అందించాడు. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలతోపాటు బంధుమిత్రులు వీరికి ఫోన్లు చేసినా, ఇద్దరూ లిఫ్ట్‌ చేయలేదు. దీంతో వారంతా కంగారుపడి అపార్ట్‌మెంట్‌ వచ్చి చూడగా.. అక్కడ వారి మృతదేహాలు కనిపించాయి. వెంటనే రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలాన్ని చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

అయితే ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. దంపతులిద్దరి మధ్య గొడవ జరిగి ఉండొచ్చని, ఆ క్రమంలోనే పెనుగులాటలో భార్యను చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఇక ఆ తర్వాత కొడుకుకు క్రిమిసంహారక మందు తాగించి, ఆనంద్‌ కూడా అదే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. పైగా తండ్రీకొడుకు నోటి నుంచి నురగలు వస్తున్న ఆనవాళ్లు కనిపించాయి. అయితే ఇందిర నోటి నుంచి ఎలాంటి నురుగులు రాలేదు. దీంతో పోస్టుమార్టం నివేదిక వస్తేనే అసలు విషయాలు తెలుస్తాయని  పోలీసులు పేర్కొన్నారు.  అయితే దంపతులు ఇద్దరు ఉదయం నుంచి గొడవపడుతున్నట్లు ఆ  అపార్ట్మెంట్  వాచ్‌మెన్‌ పోలీసులకు తెలిపాడు. మరి, ఈ ఆన్ లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్నే చిదిమేసిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి