iDreamPost

ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.. లారీ ఎక్కి శరీరాలు ఛిద్రం..

Dammapeta Road Accident: ఎన్ని చర్యలు తీసుకున్నా రోడ్డు ప్రమాదాలు ఆగడం లేదు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతూనే ఉన్నాయి. తాజాగా రోడ్డు ప్రమాదంలో వల్ల ఒక కుటుంబం చిన్నాభిన్నమైంది.

Dammapeta Road Accident: ఎన్ని చర్యలు తీసుకున్నా రోడ్డు ప్రమాదాలు ఆగడం లేదు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతూనే ఉన్నాయి. తాజాగా రోడ్డు ప్రమాదంలో వల్ల ఒక కుటుంబం చిన్నాభిన్నమైంది.

ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.. లారీ ఎక్కి శరీరాలు ఛిద్రం..

ఎన్ని అవగాహనలు తెచ్చినా.. ఎన్ని జాగ్రత్తలు చెప్పినా రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక మూల రోడ్డు రక్తమోడుతూనే ఉంది. ఈ రోడ్డు ప్రమాదల వల్ల కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. పిల్లలు అనాథలు అవుతున్నారు. ఒకరి నిర్లక్ష్యం మరొకరి కుటుంబంలో చీకటి నింపుతోంది. రోడ్డు ప్రమాదంలో ఒక ప్రాణం పోవడం అంటే.. ఒక కుటుంబం రోడ్డున పడినట్లే అన్న మాట పచ్చినిజం. ఇప్పుడు జరిగిన ఘటనలో ఒక వ్యక్తి తన మొత్తం కుటుంబాన్ని కోల్పోయాడు. అతని కళ్ల ముందే కట్టుకున్న భార్య, అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు. వారి ఛిద్రమయ్యాయి.

ఈ ఘోర రోడ్డు ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి శివారులో జరిగింది. శనివారం రాత్రి స్టేట్ హైవేపై జరిగిన ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం, చీమలపాడు గ్రామానికి చెందిన కుటుంబం ప్రమాదనికి గురైంది. బాలకృష్ణ అనే వ్యక్తి తన భార్య ఇద్దరు కుమార్తెలతో కలిసి ఖమ్మం జిల్లా వీఎం బంజర నుంచి అశ్వారావుపేట వైపునకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బాలకృష్ణ కోళ్లఫారంలో పనికి కుదిరేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా ఒక కారు వచ్చింది. ఆ కారు సైడ్ మిర్రర్ తగిలి బాలకృష్ణ బండి రోడ్డుపై పడిపోయింది. అతను ఒకవైపు పడగా.. పిల్లలు భార్య మరోవైపునకు పడ్డారు. వెనుక నుంచి వస్తున్న లారీ వారి శరీరాల మీదుగా వెళ్లింది. లారీ పైకి ఎక్కడంతో వారి శరీరాలు ఛిద్రమై పోయాయి. శరీర భాగాలు తెగిపోయి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.

ప్రమాదంలో భార్య లక్ష్మి(23), కుమార్తెలు చరణశ్రీ(8), షణ్మితశ్రీ(6) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో బాలకృష్ణకు స్వల్ప గాయాలు అవ్వడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అతడిని దమ్మపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. భార్యాపిల్లల మృతదేహాలను మార్చురీకి తరలించారు. స్థానికులు బాలకృష్ణతో మాట్లాడి వివరాలు అడగ్గా.. తాను ప్రేమ వివాహం చేసుకుని తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అతని భార్యా పిల్లలకు ఏమైందో చెప్పాలంటూ స్థానికులను వేడుకోవడం అక్కడి వారిని కలచివేసింది. అతని భార్యాపిల్లలు ఇంక లేరు అని చెప్పేందుకు వారికి ధైర్యం సరిపోలేదు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అతివేగం ప్రమాదకరం, ప్రాణాంతకం అనే విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటే మంచిది. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి