iDreamPost

నవ్వుతూ బయటకి వెళ్ళింది.. కాసేపటి తరువాత అనుకోని ఘటన!

Bengaluru Crime News: ఎంతో అల్లారుముద్దుగా పెరిగి.. ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని ఇంటి నుంచి నవ్వుతూ బయటికి వెళ్లింది.. అంతలోనే..

Bengaluru Crime News: ఎంతో అల్లారుముద్దుగా పెరిగి.. ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని ఇంటి నుంచి నవ్వుతూ బయటికి వెళ్లింది.. అంతలోనే..

నవ్వుతూ బయటకి వెళ్ళింది.. కాసేపటి తరువాత అనుకోని ఘటన!

నేటి సమాజంలో తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని మంచి పొజీషన్లో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం తమ తాహతకు మించి ఖర్చులు చేస్తుంటారు. చిన్ననాటి నుంచి ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ కాలేజీల్లో చదివిస్తుంటారు. కొంతమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో సైతం బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి విదేశాల్లో మంచి ఉద్యోగాలు సంపాదించి తమ కుటుంబ సభ్యుల కలలు నెరవేరుస్తుంటారు. అలా ఓ విద్యార్థిని బీటేక్ పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించాలని కలలు కనేది. సంతోషంగా ఇంటి నుంచి బయటికి వెళ్లింది..  కానీ ఆ విద్యార్థిని దురదృష్టం వెంటాడింది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. ఇటీవల బెంగుళూరులో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బెంగళూరులో బీఎంటీసీ బస్సు ఢీకొని ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది. బెంగళూరులోని హరిశ్చంద్ర ఘాట్ సమీపంలో ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కెంగేరిలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మల్లేశ్వరానికి చెందిన కుసుమిత(21) శుక్రవారం ఉదయం 8.30 గంటలకు స్కూటీపై కాలేజ్ కి వెళ్తుంది.

హరిశ్చంద్ర ఘాట్ సమీపంలోకి రాగానే బీఎంటీసీ బస్సు.. స్కూటీ పై వెళ్తున్న కుసుమితను ఢీ కొట్టి కొంత దూరం ఈడ్చుకువెళ్లింది. దీంతో కుసుమితకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇది గమనించి స్థానికులు వెంటనే ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతో యువతి కన్నుమూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  ఇంటి నుంచి నవ్వుతూ వెళ్లిన తమ బిడ్డ కానరాని లోకాలకు వెళ్లిందని తెలియడంతో  తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. బెంగళూరులో గత కొన్ని నెలలుగా బీఎంటీసీ బస్సు ప్రమాదాలు ఎక్కువయ్యాయి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి