iDreamPost

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి.. అసలేం జరిగింది?

America Crime News: ఇటీవల అమెరికాలో భారతీయులకు భద్రత లేకుండా పోతుందని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం కలకలం రేపుతుంది.

America Crime News: ఇటీవల అమెరికాలో భారతీయులకు భద్రత లేకుండా పోతుందని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం కలకలం రేపుతుంది.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి.. అసలేం జరిగింది?

దేశంలో ఉన్నత విద్యనభ్యసించి విదేశాల్లో మంచి ఉద్యోగం సంపాదించి హ్యాపీగా జీవించాలని చాలా మంది అనుకుంటారు. ఇటీవల పెద్ద చదువుల కోసం విదేశాలకు వెళ్లి అనుమానాస్పద పరిస్థితుల్లో కొంతమంది, దుండగుల చేతుల్లో మరికొంతమంది చనిపోతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు తీరని దుఖఃంలో మునిగిపోతున్నారు. ఈ మద్య అమెరికాలో భారతీయ సంతతికి చెందిన వారు వరుసగా చనిపోవడం తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తుంది. అమెరికాలో భారతీయుల భద్రత పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఓ ఎన్ఆర్ఐ కుటుంబం మృతి కలకం రేపుతుంది. వివరాల్లోకి వెళితే..

అమెరికాలో కేరళాకు చెందిన ఆనంద్ సుజిత్ హెన్రీ (42) ఆలీస్ ప్రియాంక(40) వారి నాలుగేళ్ల కవల పిల్లలు నోహ్, నితాన్ లు చనిపోవడం సంచలనం రేపింది.   తుపాకీ గాయాలతో కాలిఫోర్నియాలో సొంత ఇంట్లో చనిపోయి ఉండటం పలు అనుమానాలకు తావిస్తుంది. ఐటీ జంట ఆనంద్, అలీస్ బాత్రూమ్ లో తుపాకీ గాయాలతో చనిపోయి ఉన్నారు. వారి కవల పిల్లలు బెడ్ రూమ్ లో విగత జీవులుగా పడి ఉండటం పోలీసులు గుర్తించారు. అయితే ఇది హత్యా? ఆత్మహత్యా? అన్న విషయంపై సీఐబి కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. ఆనంద్ కుటుంబం గత తొమ్మిదేళ్లుగా ఇక్కడ నివసిస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా ఆనంద్, సీనియర్ అనాలిస్ట్ గా అలీస్ రెండు సంవత్సరాల క్రితం న్యూ జెర్సీ నుంచి శాన్ మాటియో కౌంటికి మారారు. అందరితో కలివిడిగా ఉంటారని పొరుగువారు, సహ ఉద్యోగులు అంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ దంపతులు కవల పిల్లలు పుట్టకముందే.. 2016లో విడాకులకు అప్లై చేసుకున్నారని.. కానీ విడాకులు మంజూరు కాలేదని రికార్డుల ప్రకారం తెలుస్తుంది. 2020 లో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసి అక్కడే ఉంటున్నారు. ఇటీవల మసాచుసెట్స్ లో భారతీయ సంతతికి చెందిన కుటుంబం, వారి కూతురు చనిపోయిన ఘటన తీవ్ర కలకం రేపింది. ఈ కేసులో ఇంటి పెద్ద తన భార్యా పిల్లలను చంపుకొని.. తనూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మరువక ముందే ఆనంద్ ఘటన తీవ్ర సంచలనం రేపుతుంది. ఇటీవల అమెరికాలో దాదాపు ఏడుగురు భారతీయ విద్యార్థులు చనిపోయారు. ఈ విషయంపై భారత్ లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ.. భారతీ విద్యార్థులకు అమెరికా సురక్షితమైన ప్రదేశంగా ఉండేలా చూస్తున్నామని, ఎలాంటి అపోహలకు గురి కావొద్దని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి