iDreamPost

సెప్టెంబర్ నుంచి మరో మూవీ ఔట్.. వాయిదా పడిన ‘టిల్లు స్క్వేర్’!

  • Author singhj Published - 07:44 PM, Mon - 4 September 23
  • Author singhj Published - 07:44 PM, Mon - 4 September 23
సెప్టెంబర్ నుంచి మరో మూవీ ఔట్.. వాయిదా పడిన ‘టిల్లు స్క్వేర్’!

టాలీవుడ్​కు ఆగస్టు నెల పెద్దగా కలసిరాలేదు. గత నెలలో తెలుగు సినిమాల కంటే ఓ బడా తమిళ మూవీదే ఇక్కడ హవా నడిచింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సహా ఆ నెలలో విడుదలైన పలు తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. ‘బెదురులంక 2012’ మాత్రమే హిట్​గా నిలిచింది. ఆగస్టు నెల మొత్తం తలైవా రజినీకాంత్ నటించిన ‘జైలర్​’దే హవా. తమిళంతో పాటు తెలుగు నాట కూడా ఈ మూవీ బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ఆగస్టు ఎలాగూ పోయింది.. సెప్టెంబర్​లోనైనా తెలుగు సినిమాలు సత్తా చాటుతాయేమోనని అందరూ అనుకున్నారు. అందుకు తగ్గట్లే పెద్ద పెద్ద మూవీస్ అన్నీ ఈ నెలలో రిలీజ్​ డేట్​ను ఫిక్స్ చేసుకున్నాయి.

రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’, రామ్ ‘స్కంధ’, సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్​’లు ఈ నెలలో విడుదలకు సిద్ధమయ్యాయి. దీంతో ఆడియెన్స్​కు పండుగేనని అంతా అనుకున్నారు. కానీ ముందుగా ప్రకటించినట్లు సెప్టెంబర్ 28న ‘సలార్’ రావడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీకి కొత్త రిలీజ్ డేట్ త్వరలో ప్రకటిస్తారని సమాచారం. దీంతో ఆ తేదీన తమ చిత్రాన్ని విడుదల చేయాలని ‘స్కంధ’ మేకర్స్ భావిస్తున్నారట. ‘స్కంధ’ వెనక్కి వెళ్లడం, ‘సలార్’ వాయిదా వార్తల నేపథ్యంలో వినాయక చవితి సీజన్​ను ఫుల్​గా క్యాష్ చేసుకునేందుకు రాఘవ లారెన్స్ నటిస్తున్న ‘చంద్రముఖి 2’ రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో తెలుగు మూవీ సెప్టెంబర్ నుంచి వెనక్కి మళ్లడం ఆసక్తికరంగా మారింది.

‘టిల్లు స్క్వేర్​’ను పోస్ట్​పోన్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ‘డీజే టిల్లు’కు సీక్వెల్​గా రూపొందుతున్న ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరసన స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన లిరికల్ సాంగ్ ఆడియెన్స్​ను ఊపేస్తోంది. ఈ తరుణంలో ‘టిల్లు స్క్వేర్’ వాయిదా వార్త అభిమానులకు నిరాశను కలిగించకమానదు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తికాకపోవడంతో మూవీని అనుకున్న తేదీకి తీసుకురాలేకపోతున్నామని మేకర్స్ తెలిపారు. మంచి వర్క్, గుడ్ విజువల్స్​తో ‘టిల్లు స్క్వేర్​’ను తీసుకొచ్చేందుకే ఈ సమయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మూవీ కొత్త రిలీజ్ డేట్ త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఈ వారం OTTలోకి ఏకంగా 17 సినిమాలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి