iDreamPost

Tillu Square: ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసిన టిల్లు స్క్వేర్ టీమ్

  • Published Feb 06, 2024 | 6:49 PMUpdated Feb 06, 2024 | 6:49 PM

సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న టిల్లు స్క్వేర్‌ మూవీ టీమ్‌ సినీ అభిమానలకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. దాంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఆ సర్‌ప్రైజ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

2024 మార్చి 29న విడుదల కానున్న టిల్లు స్క్వేర్ అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఇప్పటికే కొన్ని సార్లు పోస్ట్ పొన్ అయిన ఈ సినిమా సమ్మర్ ట్రీట్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2022 బ్లాక్ బస్టర్ డీజే టిల్లుకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా అనుపమ పరమేశ్వరన్ తన కెమిస్ట్రీతో అలరించనున్నారు.

ఇదిలా ఉండగా టిల్లు అన్న అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇస్తూ మేకర్స్ ఈరోజు ఉదయం కొత్త పోస్టర్ ను విడుదల చేశారు – రేపు ఈ సినిమా స్నీక్ పీక్ విడుదల కాబోతుంది. అయితే సినిమా టైటిల్ కింద సంగీత దర్శకుడు థమన్ పేరును చేర్చడం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. డీజే టిల్లుకి థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. అది సినిమాకి ఎంతగానో సహాయ పడింది. ముఖ్యంగా సినిమా థీమ్ మ్యూజిక్, కోర్టు సీన్ లో హీరో రీ ఎంట్రీకి ఇచ్చిన మ్యూజిక్ ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు సీక్వెల్ కు కూడా థమన్ పని చేస్తున్నారని తెలిసి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాల పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన టిల్లు స్క్వేర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రాఫి, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రామ్ మిరియాల సంగీతం అందించారు. ఈ సినిమాలో రాధికా అనే పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. అనుపమ గ్లామర్ షో సినిమాకు అదనపు ఆకర్షణగా నిలువనుంది. సీక్వెల్ సినిమాలకు ఉన్న క్రేజ్ వల్ల బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి