iDreamPost

రోడ్డు దాటుతున్న పులిని ఢీకొన్న వాహనం! వైరల్ వీడియో..

  • Author Soma Sekhar Published - 08:43 PM, Fri - 11 August 23
  • Author Soma Sekhar Published - 08:43 PM, Fri - 11 August 23
రోడ్డు దాటుతున్న పులిని ఢీకొన్న వాహనం! వైరల్ వీడియో..

సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు అనుకోకుండా కొన్ని ప్రమాదాలు ఎదురౌతూ ఉంటాయి. అయితే ఈ ప్రమాదాలు మనుషులకే కాకుండా జంతువులకు కూడా జరుగుతూ ఉంటాయి. తాజాగా రోడ్డు దాటుతున్న ఓ పులిని గుర్తుతెలియని వాహనం ఢీకొన్నది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు అటవీ అధికారి ప్రవీణ్ కశ్వాన్. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

అభయారణ్యాల్లో వన్యప్రాణులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఆ రూట్ లో వచ్చిపోయే వాహనాలు ఢీకొని జంతువులకు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా ఓ వాహనం రోడ్డు దాటుతున్న పులిని ఢీకొన్న ఘటన మహారాష్ట్రలోని గోండియా జిల్లా నవేగావ్-నాగ్జీరా కారిడార్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కాగా.. దెబ్బతిన్న పులి వయసు రెండేళ్లు ఉంటుందని అటవీ అధికారులు పేర్కొన్నారు. వాహనం ఢీకొనడంతో పులి కాలికి తీవ్రంగా దెబ్బతాకింది. దీంతో రోడ్డు లోనే కూలబడిపోయింది.

అయితే వాహనాలు ఉండటంతో.. భయంతో శరీరం సహకరించకపోయినా.. కాళ్లు ఈడ్చుకుంటూ రోడ్డు దాటి పొదల్లోకి దూకింది. ఈ దృశ్యాలను కొందరు వ్యక్తులు తమ సెల్ ఫోన్స్ లో చిత్రీకరించారు. ఈ వీడియోను ఫారెస్ట్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.”డియర్ ఫ్రెండ్స్ అడవుల్లో తిరిగే హక్కు ఫస్ట్ వన్యప్రాణులకే ఉంది. కావున ఈ ప్రాంతంలో ప్రయాణించేటప్పుడు నెమ్మదిగా, జగ్రత్తగా వెళ్లండి. నాగ్జీరా వద్ద ఈ పులిని ఓ వాహనం ఢీకొట్టింది” అంటూ రాసుకొచ్చారు. కాగా.. పులి గాయపడిన సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు అడవిలో వెతికారు. అయితే ఓ చోట తీవ్రంగా గాయపడి ఉన్న పులిని గోరెవాడలోని వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటర్ కు తరలిస్తుండగా మరణించిందని అధికారులు తెలిపారు.


ఇదికూడా చదవండి: లగ్జరీ ఎస్టేట్ కొనుగోలు చేసిన జెఫ్ బెజోస్.. ఎన్ని వందల కోట్లంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి