iDreamPost

పల్లవి ప్రశాంత్ కేసులో మరో ముగ్గురి అరెస్టు!

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో అనేక ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే అతడు బెయిల్ పై విడుదల కాగా.. తాజాగా ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వివరాలు ఏంటంటే..

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో అనేక ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే అతడు బెయిల్ పై విడుదల కాగా.. తాజాగా ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వివరాలు ఏంటంటే..

పల్లవి ప్రశాంత్ కేసులో మరో ముగ్గురి అరెస్టు!

పల్లవి ప్రశాంత్.. ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేతగా ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ రైతుబిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి విన్నర్ గా నిలిచాడు. ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే తరువాత జరిగిన రచ్చ, ఆ తరువాత జరిగిన పరిణామాలు అందరికి తెలిసిందే.  ఈ ఘటనలో ఇప్పటికే ప్రశాంత్ తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పల్లవి ప్రశాంత్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరి.. వాళ్లు ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

బిగ్ బాస్ సీజన్ 7 చాలా ప్రత్యేకంగా నిలిచిపోయింది. తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఎన్నడు జరగని విధంగా  పలు ఘటనలు ఈ షో  తరువాత చోటుచేసుకున్నాయి. అంతేకాక ఏ విన్నర్ కి లేని తలనొప్పి పల్లవి ప్రశాంత్ కి వచ్చింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం బయట జరిగిన దాడుల్లో ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరిగింది. ప్రశాంత్ అభిమానులు కొందరు సెలబ్రిటీల కార్లపై దాడులు చేశారు.  అంతేకాక ఆర్టీసీ బస్సుల అద్దాలను  ధ్వంసం చేశారు. ఇక ఈ ఘటనల అనంతరం  పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అతడు బయటకు వచ్చాడు. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు హాజరై సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది.  ఆర్టీసీ బస్సులపై దాడి, ధ్వంసం కేసులో 12 మంది నిందితులు సైతం బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఇక కేసు విషయంలో పల్లవి ప్రశాంత్ ఘటనపై కొందరు ఆయనకు మద్దతు తెలపగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇక పల్లవి ప్రశాంత్ కేసులో ఇప్పటికే  16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మరో ముగ్గురిని అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ కు చెందిన విద్యార్థి అవినాష్ రెడ్డి, యూసఫ్ గూడకు చెందిన సుధాకర్ , పవన్ లను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరు పరిచారు. కాగా, ఈ వ్యవహారంలో నమోదైన రెండు కేసుల్లో ఇప్పటికే వరకు 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పల్లవి ప్రశాంత్ కి మద్దతు సినీ నటుడు శివాజీ, బిగ్ బాస్ కంటెంస్టేంట్ అశ్విని శ్రీ  సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అలానే యావర్ సైతం పల్లవి ప్రశాంత్ కి సపోర్టుగా మాట్లాడారు. మరి.. పల్లవి ప్రశాంత్ కేసులో  మరో ముగ్గురు అరెస్టు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి