iDreamPost

ఇది అమానుషం – TNR

ఇది అమానుషం – TNR

“బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్” అనే వార్త మీద జరుగుతున్న ట్రోలింగ్స్,మరియు అలాంటి పోస్టుల కింద జనాల కామెడీ కామెంట్స్ నిజంగా బాధేస్తున్నాయ్…
అది కామెడీ కాదు…కర్కశత్వం ..
ఆ వ్యక్తి మనల్ని రకరకాలుగా ఎంతో ఎంటర్ టెయిన్ చేసిన వ్యక్తి .
రకరకాల విషయాల్లో తను ట్రోలింగ్స్ కి దొరికిపోయి ఉండొచ్చు.
అంతమాత్రాన…బాధపడాల్సిన విషయాల్లొ,జాలి పడాల్సిన విషయాల్లో కూడా ఇలా కామెడీగా ట్రోలింగ్స్ చెయ్యడం ,కామెంట్స్ చెయ్యడం సమంజసమా..?
ఒకవ్యక్తి మరణం విషయం లో పాత విషయాలన్నీ మర్చిపోయి మన శత్రువు మీద కూడా జాలి చూపిస్తామే…
అలాంటిది తనమాటలతో కేవలం కామెడీని మాత్రమే అందించిన బండ్ల గణేష్ మీద ఇలాంటి పరిస్థితిలో ట్రోలింగ్ ఎంతవరకు భావ్యం..?
ఒకవ్యక్తిని దగ్గరుండి శారీరకంగా హత్య చేస్తేనే కాదు,ఇలా4 మానసికంగా హింసించిన ఎవరైనా హంతకుడే…
పసిపిల్లలని మానభంగాలు చేసే వాళ్ళకీ,
ఆస్తుల కోసం రక్తసంబధీకుల్ని కూడా హత్యచేసే వాళ్ళకీ,
అవయాల కోసం అపహరణలు చేసే వాళ్ళకీ,
మరియు…మీకూ నా దృష్టిలో పెద్ద తేడా ఏం లేదు….
అవకాశం వస్తే మీరు కూడా ఎలాంటి పనైనా చెయ్యడానికి సిద్ధపడతారని నా నమ్మకం.
మన మాటలు బాధలో ఉన్న వ్యక్తికి ధైర్యాన్ని ఇచ్చి కోలుకునేలా ఉండాలి కానీ….కోమాలోకి వెళ్ళేలా ఉండకూడదు.
జాలి అనేది ఒకటుంటుందని,దాన్ని కనీసం అప్పుడప్పుడయినా చూపించాలని దయచేసి తెలుసుకోండి..
ఆ మధ్య ఎప్పుడో ఒక కమేడియన్ ఇంటర్వ్యూ చదివా…
ఆ కమేడియన్ చనిపోయిన తన తండ్రి శవం పాడె ముందు బాధతో నడుస్తుంటే జనాలు కామెంట్స్ చేస్తూ నవ్వుతున్నారంట…
ఆటోగ్రాఫ్ లు అడుగుతున్నారంట..
అంటే ….ఒక కమేడియన్ కి ప్రేక్షకులని నవ్వించడం తప్ప వాడి జీవితంలో బాధ,ఆవేదన లాంటి ఎలాంటి ఎమోషన్స్ ఉండవనా ఈ జనాల అభిప్రాయం…?
కమేడియన్ అంటే అంత చులకనా…?
ఇవన్నీ మనిషి బయటపడకపోయినా…మనసుకి చాలా బాధ కలిగించే విషయాలు
ఈ పోస్ట్ పెట్టేముందు “బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్” అనే ఆ వార్తలో ఎంత నిజముందో అని తెలుసుకోడానికి తనకి కాల్ చేశాను.
చాలా హాప్పీగా ఉన్నాడాయన…
“నిజమే అన్నా…పాజిటివే…గెస్ట్ హౌజ్ లో ఉన్నాను…జాగ్రత్తలు తీసుకుంటున్నాను…
హా ఏముందన్నా ఫైనల్ గా ఉంటే ఉంటాం..పోతేపోతాం…జాగ్రత్తలు తీసుకునే వరకే మనం చేయగలిగేది. అని చెప్పారు..
ఆయన ధైర్యానికి నిజంగా ఆశ్చర్యం,ఆనందం వేసింది నాకు.
నేనైనా కొంచెం ఇబ్బందిగా స్లోగా మాటాడాగానీ ఆయన మాటల్లో నాకెక్కడా బాధ మచ్చుకు కూడా వినపడలేదు.
ఇంత సీరియస్ గా నేను క్షేమసమాచారాలు తెలుసుకుంటుంటే ఫోన్ పెట్టేసే ముందు ఆయన అన్న మాట ఏంటో తెలుసా…?
“అన్నా..మన ఇంటర్వ్యూ 20లక్షల వ్యూస్ అయింది…థంబ్ నెయిల్ లో ఫిగర్ మార్చొచ్చు కదన్నా..?” అని..
నాకు ఒక్క నిమిషం మాట రాలేదు…
“అవునా…నాకూ తెలియదు…చూసి మార్పిస్తా…జాగ్రత్త” అని ఫోన్ పెట్టేశాను.
చూశారా…ఇది బండ్ల గణేష్ టేక్ ఇట్ ఈజీ మెంటాలిటీ…
సో…డోంట్ వర్రీ…ఆయన హాప్పీగానే ఉన్నారు..
అంతా మంచే జరుగుతుంది…
తన పాజిటివ్ మెంటాలిటీతో తొందరగా కోలుకుని మళ్ళీ మీడియా ముందుకి రావడం కూడా త్వరలోనే జరుగుతుంది.
వీలైతే మీరు కూడా బండ్ల బాబు త్వరగా కోరుకోవాలని మనసులో కోరుకొండి….అయిపోద్ది…
ఎనీవే …దయచేసి ఆ ట్రోలింగ్ పోస్టులని ,కామెంట్స్ ని తీసేస్తే మనసులో మీకు రెండుచేతులెత్తి మొక్కుతాను….
thank you..😍🙏 – TNR
————————–
[ గమనిక : ఇది కేవలం నేను బండ్ల గణేష్ ని సపోర్ట్ చేస్తూ పెట్టిందో ఇంకోటో కాదండి..
అతని స్థానం లో ఎవరున్నా కూడా నేను ఇలాగే స్పందించేవాన్ని.
ఈ పోస్ట్ కేవలం కామెడీగా ట్రోలింగ్ చేసినవాళ్ళను,కామెంట్స్ చేసిన వాళ్ళను ఉద్దేశించి పెట్టింది మాత్రమే..
ఆ ట్రోలింగ్ పోస్టులు,కామెంట్స్ పెట్టిన వాళ్ళతో నాకెలాంటి కక్షలు లేవు….
కనీసం పరిచయాలు కూడా లేవు.
ఒక నటుడికి జరుగుతున్న అవహేళనని తట్టుకోలేక విపరీతమైన బాధతో మాత్రమే ఈ పోస్ట్ పెట్టడం జరిగింది..
ఎవరి మనసైనా బాధపడి ఉంటే క్షమించగలరు… ]

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి