iDreamPost

సంక్రాంతి సినిమాల బ్రేక్ ఈవెన్ అసలు లెక్కలు ఇవే..!

Breakeven for Guntur Kaaram, Hanuman and other Sankranthi Movies: 2024 సంక్రాంతి కి పోటీ తీవ్రంగా ఉండబోతుంది అంటూ మొదటి నుండే ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే పోటీ మామూలుగా లేదు. అయిదు సినిమాలు పండుగ కి రాబోతున్నాయి. ఆ అయిదు సినిమాల్లో ఏ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్ ఎంత అనేది ఇప్పుడు కాస్త అటు ఇటుగా తెలుసుకుందాం.

Breakeven for Guntur Kaaram, Hanuman and other Sankranthi Movies: 2024 సంక్రాంతి కి పోటీ తీవ్రంగా ఉండబోతుంది అంటూ మొదటి నుండే ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే పోటీ మామూలుగా లేదు. అయిదు సినిమాలు పండుగ కి రాబోతున్నాయి. ఆ అయిదు సినిమాల్లో ఏ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్ ఎంత అనేది ఇప్పుడు కాస్త అటు ఇటుగా తెలుసుకుందాం.

సంక్రాంతి సినిమాల బ్రేక్ ఈవెన్ అసలు లెక్కలు ఇవే..!

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద గతంలో ఎప్పుడు లేని విధంగా పోటీ నెలకొంది. మూడు రోజుల గ్యాప్‌ లో ఏకంగా అయిదు సినిమాలు రాబోతున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో పాటు తేజ ‘హనుమాన్‌’ సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. ఇంకా ఈగల్‌, సైంధవ్‌ మరియు నా సామి రంగ సినిమాలు కూడా సంక్రాంతి రేసులో నిలవడంతో పాటు ప్రేక్షకులకు ఈసారి పండుగ రుచి చూపిస్తామని చాలా నమ్మకంగా చెప్పడం జరుగుతుంది. అన్ని సినిమాల్లోకి గుంటూరు కారం సినిమా భారీ బడ్జెట్‌ తో రూపొందడంతో పాటు, భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేసింది. మీడియా వర్గాలు మరియు ఫ్యాన్స్‌ పేజీల్లో సంక్రాంతి సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ట్రెండ్‌ అవుతున్నాయి. ఇప్పడు వాటి గురించి చూద్దాం.

గుంటూరు కారం సినిమా దాదాపుగా రూ.125 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. దాంతో ఈ సినిమాకు రూ.130 కోట్ల వసూళ్లు నమోదు అవ్వాల్సి ఉంది. మహేష్‌ బాబు స్టామినా కి రూ.130 కోట్ల టార్గెట్‌ పెద్దది ఏమీ కాదని, రెండు వారాల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబో మూవీకి ఉన్న క్రేజ్‌ అలాంటిది. అందుకే సినిమాకు ఆ రేంజ్‌ బిజినెస్‌ అయింది.. అదే రేంజ్ లో ఓపెనింగ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక నాగార్జున నటించిన నా సామిరంగ సినిమా కూడా అన్ని ఏరియాలు కలిపి దాదాపుగా 35 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంది. నాగ్‌ గత చిత్రాల అనుభవం నేపథ్యంలో రూ.35 కోట్లు పెద్ద కష్టం కాకపోవచ్చు అని అక్కినేని ఫ్యాన్స్‌ అంటున్నారు.

తేజ హనుమాన్‌ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్‌ ఇండియా రేంజ్ లో విడుదల అవ్వబోతుంది. పాన్‌ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.35 కోట్ల వసూళ్లు నమోదు చేస్తే బ్రేక్ ఈవెన్‌ సాధ్యం అయినట్లుగా సమాచారం అందుతోంది. టీజర్‌ కి వచ్చిన స్పందన, ట్రైలర్‌ తో సినిమా స్థాయి పెరగడం వంటి కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో పోటీ ఉన్నా కూడా ఇతర రాష్ట్రాల్లో మరియు ఇక్కడ లాంగ్‌ రన్‌ లో బ్రేక్‌ ఈవెన్ సాధ్యమే అన్నట్లుగా యూనిట్ సభ్యులు నమ్మకంతో ఉన్నారు. ఇక వెంకీ సైంధవ్ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇత రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 22.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేయడం జరిగింది. కనుక రూ.25 కోట్ల టార్గెట్ తో సైంధవ్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే మాస్ రాజా రవితేజ కూడా తన ఈగల్‌ సినిమాకు దాదాపుగా 23 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తే బ్రేక్‌ ఈవెన్‌ అయ్యేంతగా బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి సంక్రాంతి సినిమాలు విడి విడిగా చూస్తే వాటి బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ తక్కువే ఉంది. అయితే అయిదు సినిమాలు ఒకే సారి వస్తే కచ్చితంగా ఏదో ఒకటి లేదా రెండు సినిమాలకు నష్టం తప్పదని బాక్సాఫీస్ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ఈ సంక్రాంతి సినిమాల్లో ఏది మొదట బ్రేక్‌ ఈవెన్‌ వసూళ్లకు చేరుతుందని మీరు భావిస్తున్నారు?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి