iDreamPost

గొప్ప ఫలితాల వెనకాల తీయని కష్టాలు ఖచ్చితంగా ఉంటాయ్ మరి – TNR

గొప్ప ఫలితాల వెనకాల తీయని కష్టాలు ఖచ్చితంగా ఉంటాయ్ మరి – TNR

an ADR experience..
ADR అంటే “Additional Dialogue Recording”
మామూలుగా ఈరోజుల్లో చాలా సినిమాలకి సింక్ సౌండ్ లోనే డైలాగ్స్ రికార్డ్ చేస్తున్నారు.
కానీ ఆర్టిస్ట్స్ నుండి కొన్ని డైలాగ్స్ డైరెక్టర్ అనుకున్నట్టుగా లొకేషన్ లో రాకపోవొచ్చు.
అనుకున్న యాస రాకపోవొచ్చు…
ఇంకా ఏవైనా రకరకాల కారణాలతో డైరెక్టర్ అసంతృప్తిగా ఉండొచ్చు.
షూటింగ్ లో పరిస్థితులు అనుకూలించక రీటేక్ చేసే అవకాశం ఉండకపోవొచ్చు.
అప్పుడు ఆ పర్టిక్యులర్ పార్ట్ కి మాత్రం మళ్ళీ డబ్బింగ్ పెట్టుకుని వాళ్ళకు నచ్చినట్టుగా చెప్పించుకుంటారు.
దాన్నే “Additional Dialogue Recording” అంటారు.
[ పై వివరణ ADR అంటే తెలియని వాళ్ళ కోసం మాత్రమే ].
ఈ మధ్య నేను యాక్ట్ చేసిన “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య” సినిమా సింక్ సౌండ్ లో చేశారు.
యాస సరిగా లేని చోట,నాయిస్ డిస్ట్రబింగ్ గా ఉన్న కొన్నిచోట్ల “ADR” అవసరం పడింది.
అలా ఆ సినిమాకి “ADR” చేస్తూ డైరెక్టర్ “వెంకటేశ్ మహా” తో డైలాగ్ విషయం లో కుస్తీ పడుతున్న సందర్భం ఇది.
నేను చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పి ఉన్నాను…
ఈ “ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య”కి మాత్రం కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది.
నా క్యారెక్టర్ కి ఒక యాస ఉండటం వలననే ఆ కష్టం.
ప్రతీ పదాన్ని ఒకటికి పదిసార్లు పట్టి పట్టి ఒక స్టూడెంట్ కి టీచర్ చెప్పినట్టుగా చాలా జాగ్రత్తగా
నన్ను గైడ్ చేశాడు మహా.
రెండురోజులు నా క్యారెక్టర్ కి ADR చేశాను.
డబ్బింగ్ థియేటర్ కి వెళ్ళిన ఆ రెండురోజులు నాకు ఓ చిన్న పిల్లాడు మారాం చేస్తూ స్కూల్ కి వెళ్ళిన్నట్టే అనిపించింది.
తాట తీశాడు మహా…
పని రాక్షసుడు …
మరి దాని రిజల్ట్ మీకు స్క్రీన్ మీద ఖచ్చితంగా కనపడుతుంది.
గొప్ప ఫలితాల వెనకాల తీయని కష్టాలు ఖచ్చితంగా ఉంటాయ్.
మరి ఇలాంటి చిన్న చిన్న తీయని కష్టాలతో కూడిన ఆ గొప్ప ఫలితం కోసం నేను సరిగ్గా రెండు నెలలు వేచి చూడాల్సిందే..
“ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య” ఎప్రిల్ 17 విడుదల

– TNR

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి