iDreamPost

ది టుమారో వార్ రిపోర్ట్

ది టుమారో వార్ రిపోర్ట్

గత ఏడాది కాలంగా డైరెక్ట్ ఓటిటిలో ఎక్కువగా మన బాషల సినిమాలే చూసే అలవాటైన ప్రేక్షకులకు అమెజాన్ ప్రైమ్ భారీ ఎత్తున రిలీజ్ చేసిన హాలీవుడ్ మూవీ ది టుమారో వార్. క్రిస్ ప్రాట్ నటించడంతో పాటు ట్రైలర్ ని ఆసక్తికరంగా కట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇవాళ ఉదయం నుంచి స్ట్రీమింగ్ లో వచ్చిన ది టుమారో వార్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు కోట్లలో ఉన్నారు. క్రిస్ మెకే దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మీద ప్రైమ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా లయన్ గేట్స్ ప్లే, హెచ్బిఓ మ్యాక్స్ లాంటి ఓటిటిలు ఇండియాకు వచ్చిన నేపథ్యంలో ప్రమోషన్ కూడా గట్టిగానే చేసింది.

మరి ఇది మెప్పించేలా సాగిందో లేదో రిపోర్ట్ లో చూద్దాం. కొన్ని దశాబ్దాల తర్వాత రాబోయే విపరీతమైన పరిణామాలు వాటి వల్ల మానవాళి అంతరించిపోయే ప్రమాదాన్ని గుర్తించిన ప్రపంచ దేశాలు దాన్ని ఎదురుకోవడం కోసం సమిష్టిగా ఒక సైన్యాన్ని తయారు చేస్తారు. వాళ్ళు భవిష్య కాలానికి వెళ్లి మనుషులను నగరాలను విధ్వంసం చేస్తున్న అంతుచిక్కని రాకాసి జంతువుల అంతు చూసేందుకు నడుం బిగిస్తారు. ఈ క్రమంలో జరిగే సంఘటనలు, చివరికి ఈ ఆర్మీ ఎలా విజయం సాధించిందనేదే అసలు కథ. ఇది చదవగానే ఎడ్జ్ అఫ్ టుమారో. ఇండిపెండెన్స్ డే లాంటి సినిమాలు గుర్తుకు వస్తే మీకు మంచి మూవీ నాలెడ్జ్ ఉన్నట్టే.

తీసిన కథలే మళ్ళీ మళ్ళీ తీయడం హాలీవుడ్ లో కొత్తేమి కాకపోయినా గ్రాఫిక్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో మెప్పిస్తూ ఎప్పటికప్పుడు హిట్లు కొడుతూనే ఉంటారు. కానీ ది టుమారో వార్ మాత్రం ఆ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఏలియన్స్ సృష్టించే విధ్వంసాన్ని అద్భుతంగా చిత్రీకరించడం తప్పించి మిగిలిన స్క్రీన్ ప్లే మొత్తం దీన్నో మాములు సగటు సినిమాగా మార్చింది. నిడివి కూడా 2 గంటల 20 నిముషాలు ఉండటం ల్యాగ్ ని పెంచేసి చాలా చోట్ల బోర్ కొట్టిస్తుంది. ఇలాంటి జానర్ మూవీస్ ని విపరీతంగా ఇష్టపడే వాళ్ళకే యావరేజ్ గా అనిపించే ది టుమారో వార్ సగటు ప్రేక్షకులకు మాత్రం శిరోభారమే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి