iDreamPost

నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన! ప్రభుత్వం జీవో జారీ

Special regime in Panchayats: తెలంగాణలో నేటితో సర్పంచ్ పదవీకాలం ముగిసింది.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Special regime in Panchayats: తెలంగాణలో నేటితో సర్పంచ్ పదవీకాలం ముగిసింది.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన! ప్రభుత్వం జీవో జారీ

ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీబాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల అమలు విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. మహాలక్ష్మి పథకానికి విపరీతమైన స్పందన వస్తుంది. ఇటీవల ఆరు గ్యారెంటీ పథకాల కోసం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో బుధవారం నాటికి సర్పంచ్ ల పదవీ కాలం ముగిసిపోయింది. గురువారం నుంచి రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, 2018 సెక్షన్ 136(3) కింద ప్రత్యేక అధికారులను నియమించినట్లు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా  జీవో జారీ చేశారు. రాష్ట్రంలోని 12 వేల 769 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. శుక్రవారం అధికారులు భాధ్యతలు స్వీకరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆయా మండలాల్లోని ఎంపీడీవో, తహశీల్దార్, ఎంపీవో, డీటీ, ఇంజనీర్లు, ఆర్ఐలతో పాటు ఇతర గెజిటెడ్ ఆఫీసర్లు ప్రత్యేక అధికారులుగా నియమించారు.

గురువారం సాయంత్రవ వరకు సర్పంచుల ఆధీనంలో ఉన్న డిజిటల్ కీలు, చెక్కులు, ఇతర రికార్డులను స్వాధీనం చేసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రత్యేక అధికారికి, కార్యదర్శికి ప్రభుత్వం జాయింట్ చెక్ పవర్ అవకాశం కూడా కల్పించారు. ఈ నెల 3న ప్రత్యేక అధికారుల పాలనకు సంబంధించి నిర్వహించాల్సిన విధి విధానాలు, పర్యవేక్షణ, చేపట్టాల్సిన పనులు తదితర అంశాల పై చర్చించేందుకు మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి