iDreamPost

వీధి కుక్క అడ్డురావడంతో వెనక్కు వచ్చేసిన విమానం..!

వాహనాలకు ఎవరైనా అడ్డు వస్తే.. తప్పుకోండి ప్లీజ్ అని హారన్ కొడతాం. రైలు అయితే.. కొన్నిసార్లు గుద్దుకుని వెళ్లిపోతుంటాయి. కానీ ఫ్లైట్లు అలా కాదు.. ఆకాశంలో చిన్న సమస్య ఏర్పడ్డ, ల్యాండింగ్ విషయంలో అనుకోని ఉపద్రవం ఎదురైనా .. పెను విపత్తు ఎదుర్కొవలసి ఉంటుంది.

వాహనాలకు ఎవరైనా అడ్డు వస్తే.. తప్పుకోండి ప్లీజ్ అని హారన్ కొడతాం. రైలు అయితే.. కొన్నిసార్లు గుద్దుకుని వెళ్లిపోతుంటాయి. కానీ ఫ్లైట్లు అలా కాదు.. ఆకాశంలో చిన్న సమస్య ఏర్పడ్డ, ల్యాండింగ్ విషయంలో అనుకోని ఉపద్రవం ఎదురైనా .. పెను విపత్తు ఎదుర్కొవలసి ఉంటుంది.

వీధి కుక్క అడ్డురావడంతో వెనక్కు వచ్చేసిన విమానం..!

ఇటీవల కాలంలో కొన్ని విమాన సంస్థలు వార్తల్లో నిలుస్తూ చర్చలకు దారి తీస్తున్నాయి. ప్రయాణీకుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాయి కొన్ని విమానయాన సంస్థలు. మొన్నటి మొన్న డయాబెటిస్‌తో బాధపడుతున్న మహిళ పట్ల దారుణంగా వ్యవహరించిన సిబ్బంది. ఆమెను బలవంతంగా కిందకు దింపేశారు యుకేలో. అలాగే తోటి ప్రయాణీకుడు మద్యం సేవించి మూత్రం పోసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. మొన్నటికి మొన్న ప్రముఖ నటి దివ్య ప్రభ.. ఎయిరిండియాలో ప్రయాణిస్తుండగా.. తోటి ప్రయాణికుడు వేధించిన సంగతి విదితమే. అయితే ఓ కుక్క కారణంగా గమ్య స్థానానికి చేరుకున్న ఓ విమానం.. తిరిగి వెనక్కు వచ్చిన వింత ఘటన తాజాగా చోటుచేసుకుంది.

విస్తారా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఫ్లైట్..రన్ వే పై కుక్క కనిపించడంతో వెనుదిరిగింది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం గోవాలోని దబోలిమ్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. విస్తారా ఎయిర్ లైన్స్‌కు చెందిన యూకే 881 ఫ్లైట్ కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుండి గోవాలోని దబోలిమ్ విమానాశ్రయానికి సోమవారం మధ్యాహ్నం 12.55 గంటలకు 100 మంది ప్రయాణీకులతో బయలు దేరింది. మధ్యాహ్నం 2 గంటలకు గోవా విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే అదే సమయంలో రన్ వేపై కుక్కు ఉండటాన్ని గమనించారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. వెంటనే విమానం పైలట్‌ను అప్రమత్తం చేశారు. ఫ్లైట్‌ను ల్యాండ్ చేస్తే ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని తెలిసి.. పైలట్‌కు సూచించారు.

దీంతో విమానం కాసేపు గాల్లోనే ఉండిపోయింది. వీధి కుక్క ఆ రన్ వే పై నుండి కదలకుండా ఉండిపోవడంతో, ల్యాండ్ అవ్వడం కష్టమని భావించి.. విమానాన్ని తిరిగి బెంగళూరు పంపారు అధికారులు. గంట తర్వాత అంటే మధ్యాహ్నం 3.05 సమయంలో తిరిగి విమానం కెంపెగౌడ విమానశ్రయంలో ల్యాండ్ అయ్యింది. అయితే గమ్య స్థానం వరకు వెళ్లిన విమానం తిరిగి.. వెనక్కు రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రయాణీకులు. వారికి జరిగిన విషయం చెప్పారు. మళ్లీ సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరిన విమానం సాయంత్రం 6.15 నిమిసాలకు గోవాలోని ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి