iDreamPost

ఈ ఫోటోలోని చిన్నోడు.. టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో గెస్ చేయండి

చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించి.. ఆ తర్వాత చదువులపై ఫోకస్ పెట్టి.. ఉద్యోగాలు మనకు సెట్ కావని భావించి.. తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాప్ హీరో, హీరోయిన్లుగా రాణించిన/ కొనసాగుతున్న నటీనటులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నోడు కూడా..

చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించి.. ఆ తర్వాత చదువులపై ఫోకస్ పెట్టి.. ఉద్యోగాలు మనకు సెట్ కావని భావించి.. తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాప్ హీరో, హీరోయిన్లుగా రాణించిన/ కొనసాగుతున్న నటీనటులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నోడు కూడా..

ఈ ఫోటోలోని చిన్నోడు.. టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో గెస్ చేయండి

చిన్న వయస్సులో సినిమాల్లో నటించి.. ఆ తర్వాత చదువు, కెరీర్ అంటూ మూవీస్ పక్కన పెట్టి, తిరిగి ఇదే తమ ప్రపంచమనుకుని.. మళ్లీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ పొందారు చాలా మంది నటీనటులు. కమల్ హాసన్ మొదలుకొని తేజ సజ్జ వరకు ఆ జాబితాలోకి వస్తారు. అయితే ఇందులో కొంత మందే స్టార్లుగా సక్సెస్ పొందితే.. మరికొంత మంది అరకొర సినిమాలతో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తున్న పిల్లాడు కూడా కేవలం ఒక్కటంటే ఒక్కటే తెలుగు సినిమా చేసి.. తెరకు దూరమై.. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా మారాడు. ముఖ్యంగా మహిళా అభిమానుల మనసుల్ని చూరగొన్నాడు. ఇంతకు అతడు ఎవరో గుర్తుపట్టారా..?

కాస్త తీక్షణంగా చూసిన.. అతడెవరో గెస్ చేయలేకపోతున్నారా..? ఎవరో కాదండీ.. ఓ చంటి, ఓ పెళ్లి కానీ ప్రసాద్, ఓ నాగ నాయుడు అలియాస్ వెంకటేష్. అభిమానులు విక్టరీ వెంకటేష్, వెంకీ మామా అంటూ పిలుస్తుంటారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు రెండో కుమారుడు వెంకటేష్ చిన్నప్పుడు ఓ సినిమాలో నటించాడు. ఆ పిక్‌లో ఉంది మన వెంకీ మామనే. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్వర్గీయ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సూపర్ డూపర్ హిట్ మూవీ ప్రేమ నగర్ మూవీలోది ఆ స్టిల్. అందులో సత్యనారాయణ చిన్నప్పటి పాత్రలో కనిపించారు వెంకటేష్. అందులో కేశవ్ వర్మ అనే క్యారెక్టర్ చేశారు. చైల్డ్ ఆర్టిస్టుగా అదే తొలి సినిమా, అదే చివరి సినిమా. ఈ రోజు విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు.

1960లో ఏపీలోని కారంచేడులో డిసెంబర్ 13న పుట్టిన వెంకటేష్.. విదేశాల్లో ఎంబీఎ పూర్తి చేశారు. 1986లో కలియుగ పాండవులు మూవీతో హీరోగా కెరీర్ ప్రారంభించి.. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అందరికీ ఫేవరేట్ హీరో ఉంటారు.. అలాగే అందరికీ నచ్చే నటుడు అంటే అది వెంకటేష్ మాత్రమే. కుటుంబ కథా చిత్రాలతో మహిళ అభిమానుల్ని సంపాదించుకున్నారు. యాక్షన్, మాస్ మూవీస్‌తో యూత్‌ను ఆకట్టుకున్నారు. ఒకప్పుడు స్టైల్ అంటే వెంకటేష్ అనుకునేంతలా ఉండేది. నంబరింగ్ గేమ్‌తో, నంబర్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఆయనలో ఆధ్యాత్మికత చాలా ఎక్కువ. వెంకీతో మాట్లాడిన తోటి నటులు ఎప్పుడూ ఈ విషయాన్నే చెబుతూ ఉంటారు. మల్టీ స్టారర్ మూవీలకు తిరిగి ఆజ్యం పోసిన యాక్టర్ ఆయన.

80ల నుండి అలరిస్తున్న ఈ నటుడు.. వెంకీ మామ, ఎఫ్2, ఎఫ్3 మూవీస్‌తో ఇప్పటి తరానికి కూడా చేరువయ్యారు. ఆయన ఎక్కువ రీమేక్ సినిమాలు చేస్తుండటంతో రీమేక్ రాజా అనే ముద్ర పడింది. అయినప్పటికీ.. మిగిలిన హీరోలతో పోల్చుకుంటే.. ఆయన సక్సెస్ రేటు ఎక్కువ. అలాగే తెలుగు హీరోల్లో ఏడు నంది అవార్డులు అందుకున్న తొలి నటుడు ఆయన కావడం విశేషం. 37 ఏళ్ల నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు వెంకీ మామ. రానా నాయుడు వెబ్ సిరీస్‌లో నెగిటివ్ టచ్‌లో కనిపించి మహిళల కోపానికి గురైన ఆయన.. ఆ తర్వాత జాగ్రత్తగా ఉంటానని చెప్పారు. ఇప్పుడు తన 75వ మూవీ సైంధవ్ తో రాబోతున్నారు. ఈ సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇంతకు వెంకటేష్ చిత్రాల్లో ఏ మూవీ అంటే ఇష్టమో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి