iDreamPost

విజయనగరంలో దోషికి 23 ఏళ్ల జైలు శిక్ష.. ఏ తప్పు చేశాడంటే..?

దేశంలో ఎన్ని చట్టాలు, న్యాయ స్థానాలు ఉన్నా ఆడ పిల్లలపై అత్యాచారాలు ఆగడం లేదు. ముఖ్యంగా చిన్నారులు, బాలికలపై జరుగుతున్న లైంగిక దోపిడీ అమానుషం. న్యాయ స్థానంలో వెంటనే శిక్ష పడకపోవడం, చట్టాల్లో ఉన్న లొసుగులను వినియోగించుకుని బయటపడటం కామాంధులకు మరింత బలాన్ని ఇస్తుంది. తాజాగా ఓ అత్యాచార కేసులో ఏపీలోని ఓ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

దేశంలో ఎన్ని చట్టాలు, న్యాయ స్థానాలు ఉన్నా ఆడ పిల్లలపై అత్యాచారాలు ఆగడం లేదు. ముఖ్యంగా చిన్నారులు, బాలికలపై జరుగుతున్న లైంగిక దోపిడీ అమానుషం. న్యాయ స్థానంలో వెంటనే శిక్ష పడకపోవడం, చట్టాల్లో ఉన్న లొసుగులను వినియోగించుకుని బయటపడటం కామాంధులకు మరింత బలాన్ని ఇస్తుంది. తాజాగా ఓ అత్యాచార కేసులో ఏపీలోని ఓ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

విజయనగరంలో దోషికి 23 ఏళ్ల జైలు శిక్ష.. ఏ తప్పు చేశాడంటే..?

ఆడ పిల్లలు పుట్టారని సంబర పడే లోపు.. ఏ పాడు కళ్లు పడతాయో అన్న ఆందోళన మొదలైంది తల్లిదండ్రులకు. చిన్న వయస్సులోనే లైంగిక వేధింపులకు గురి అవుతున్న ఘటనలు చూసి.. బయటకు పంపేందుకు నిరాకరిస్తున్నారు. కనీసం ఆడుకునేందుకు కూడా స్నేహితులతో పంపడం లేదు. అభం, శుభం తెలియని చిన్నారులపై కామాంధులు అఘాయిత్యానికి తెగబడుతున్న సంఘటనలతో ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ వీరిపై అమానుష దాడులు ఆగడం లేదు. రెప్పపాటుతో ఆడపిల్లలపై ముఖ్యంగా నోరు విప్పి చెప్పలేని పసి పిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు దుర్మార్గులు. దీంతో ఆ చిన్నారుల మనస్సులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చివరికి మగాడిని నమ్మలేని మానసిక స్థితికి చేరిపోతుంది చిన్నారి.

అయితే ఓ చిన్నారిపై జరిగిన అత్యాచార కేసులో ఏపీలోని స్థానిక కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2019 నాటి అత్యాచార ఘటనపై తాజాగా తీర్పు వెలువడగా.. నిందితుడికి ఏకంగా 23 ఏళ్లకు పైగా జైలు శిక్షను విధించింది విజయనగరంలోని పోక్సో న్యాయ స్థానం . కేసు వివరాల్లోకి వె ళితే.. 2019లో విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పాత పెంట గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి.. అంగన్ వాడీ బడికి వెళ్లి వస్తూ ఉండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన గిరిడ లక్ష్మణరావు అనే యువకుడు..చాక్లెట్ ఆశ చూపించి.. ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక ఇంటికి సమీపంలో వదిలి పెట్టాడు. ఇంటికి చేరుకున్న చిన్నారి పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు.. ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు పరీక్షించగా.. ఆమెపై అత్యాచారం అయినట్లు ధ్రువీకరించారు. వైద్యుల సమాచారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. అయితే ఆమెపై అత్యాచారానికి గిరిడ లక్ష్మణరావు అని చిన్నారి తెలిపిన వివరాలతో నిర్ధారించుకున్నారు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. బాలల హక్కుల సంఘాలు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు. నిందితుడ్ని అరెస్టు చేసి.. కోర్టులో అభియోగ పత్రం సమర్పించారు. కోర్టులో ఇన్నాళ్ల పాటు విచారణ కొనసాగగా.. తాజాగా తీర్పు నిచ్చింది విజయనగరంలోని పోక్సో చట్టం. నిందితుడికి 23 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి