iDreamPost

ఎల్జీ పాలిమర్స్ వద్ద ఉద్రిక్తత

ఎల్జీ పాలిమర్స్ వద్ద ఉద్రిక్తత

విశాఖ సమీపంలోని ఆర్ ఆర్ వెంకటాపురం లో విషవాయువు లీకై 12 మంది మరణానికి కారణమైన ఎల్జి పాలిమర్స్ కంపెనీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషవాయువు లీకైన ఘటనలో చనిపోయినవారి మృతదేహాలను ఈరోజు కింగ్ జార్జ్ ఆసుపత్రి నుంచి ఆర్ఆర్ వెంకటాపురం కి తీసుకు వచ్చారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తులైన గ్రామ ప్రజలు మృతదేహాలను కంపెనీ గేటు ముందు ఉంచి ఆందోళనకు దిగారు. కంపెనీ ప్రతినిధులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.కంపెనీలో కి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.

ఘటనాస్థలానికి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ వచ్చి గ్రామస్తులు శాంతింప చేసే ప్రయత్నం చేశారు. ఇంత ప్రమాదం జరిగిన కంపెనీ యాజమాన్యం తన బాగోగులు పై కనీసం స్పందించలేదంటూ యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ ప్రతినిధులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ ప్రతినిధులు కానీ రాజకీయ పార్టీల నేతలు వచ్చి కంపెనీని చూసి వెళ్తున్నారు తాము తిన్నమా..? కనీసం మంచినీళ్లు తాగామా..? అని కూడా అడగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వచ్ఛంద సంస్థలు తమ ఆదుకుంటుందని పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి