iDreamPost

వాడేసిన ప్లాస్టీక్ బాటిల్ ఇస్తే.. రూ.10 ఆఫర్.. ఎక్కడంటే!

  • Published Nov 16, 2023 | 11:36 AMUpdated Nov 16, 2023 | 11:41 AM

ప్రపంచంలో నానాటికీ పర్యావరణ కాలుష్యం పెరిగిపోతూనే ఉంది.. దీనికి కారణం మనిషే. మనం వాడేసిన ప్లాస్టీక్ భూమిలో కరిగిపోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ప్లాస్టీక్ నిషేదం అమల్లో ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు.

ప్రపంచంలో నానాటికీ పర్యావరణ కాలుష్యం పెరిగిపోతూనే ఉంది.. దీనికి కారణం మనిషే. మనం వాడేసిన ప్లాస్టీక్ భూమిలో కరిగిపోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ప్లాస్టీక్ నిషేదం అమల్లో ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు.

  • Published Nov 16, 2023 | 11:36 AMUpdated Nov 16, 2023 | 11:41 AM
వాడేసిన ప్లాస్టీక్ బాటిల్ ఇస్తే.. రూ.10 ఆఫర్.. ఎక్కడంటే!

ప్రపంచాన్ని ప్లాస్టిక్ భూతం మింగేస్తుంది. అడవి జంతువులు, సముద్రపు జీవులను హరించడంతో పాటు మానవాళి మనుగడకు కూడా ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ నిషేదం ఉన్నప్పటికీ.. ఎవరూ ఆ నిబంధనలు పాటించకపోవడం దురదృష్టం. గ్లోబల్ ప్లాస్టిక్ కాలుష్యం 1950లో 2 మిలియన్ టన్నులు ఉండగా.. ఇప్పుడు 391 మిలియన్ టన్నులను దాటిపోవడం నిజంగా ఆందోళన కలిగించే విషయం. మనిషి ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ ని వాడుతూనే ఉన్నాడు. 2040 నాటికి దీని వినియోగం రెట్టింపు అవుతుందని పర్యావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో నానాటికీ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. పెద్ద పెద్ద కంపెనీలు, వాహనాల నుంచి వచ్చే పొగతో వాయు కాలుష్యం, కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థాలతో నీటి కాలుష్యం, ప్లాస్టిక్ వేస్ట్ తో నేల కాలుష్యం. ఉదయం పాల ప్యాకెట్ మొదలు రాత్రి ఇంటికి తీసుకువెళ్లే సరుకుల వరకు ప్రతీదీ ప్లాస్టిక్ తో తయారు చేసినవే. మనిషి తనకు తెలియకుండానే 24 గంటలూ ప్లాస్టిక్ పై ఆధారపడి ఉంటున్నాడు.

ఈ కాలుష్యం వల్ల మనిషి ఆయుష్షు ఇప్పటికే చాలా వరకు తగ్గిపోయింది. భవిష్యత్ లో కాలుష్యం వల్ల మానవాళికి ఎంతో ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్లాస్టిక్ వినియోగించవద్దని ఎన్ని అవగాహన సదస్సులు పెట్టినా ఫలితం లేకుండా పోతున్నాయి. ప్లాస్టిక్ నిషేదం ఉన్నప్పటికీ వ్యాపారస్తులు వాటిని ఖాతరు చేయడం లేదు. ప్లాస్టిక్ వేస్టు తినడం వల్ల ఎన్నో సాదు జంతువులు చనిపోతున్నాయి. ఈ క్రమంలో దేశంలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు కొన్ని చోట్ల ఆఫర్లు ప్రకటిస్తూ పర్యావరణాన్ని రక్షించే బాధ్యత చేపడుతున్నారు. ప్లాస్టీక్ వినియోగాన్ని తగ్గించడానికి.. ఒక జూపార్క్ లో వినూత్న ప్రయోగం చేపట్టారు. వినియోగించిన ప్లాస్టిక్ బాటిల్ తిరిగి ఇస్తే.. రూ.10 ఇస్తామని వండలూరు జూ పార్క్ అధికారులు తెలిపారు. ఈ పార్క్ లో దాదాపు 2 వేలకు పైగా వన్యమృగాలు, పక్షులు ఉన్నాయి. వీకెండ్ లో ఇక్కడికి సుమారు 3 వేల మంది, సెలవు రోజుల్లో పదివేల మంది వరకు సందర్శకులు వస్తుంటారు.

ఇక్కడ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉండటంతో దాన్ని అడ్డుకునేలా పార్క్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎంట్రన్స్ వద్ద సందర్శకులు తీసుకువచ్చే వస్తువులు తనిఖీ చేసి ప్లాస్టిక్ సంచుల్లో తెచ్చే ఆహార పదార్ధాలను పేపర్ సంచుల్లో మార్చి అందిస్తున్నారు. అంతేకాదు జంతువు బోన్లలో, పార్కు ఖాళీ ప్రదేశాల్లో వాడేసిన వాటర్ బాటిల్స్ ని నిర్లక్ష్యంగా పడవేస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి కొత్త విధానం తీసుకువచ్చారు. సందర్శకులు తీసుకువచ్చే ప్లాస్టిక్ బాటిల్ పై స్టిక్కర్స్ అంటించి రూ.10 వసూళు చేసి.. తిరిగి వెళ్లే సమయంలో ఆ బాటిల్ ఇస్తే.. రూ.10 తిరిగి ఇచ్చేస్తున్నారు. దీని వల్ల ప్లాస్టిక్ దుర్వినియోగం కాకుండా ఉంటుందని అంటున్నారు. మరి ప్లాస్టిక్ బాటిల్ కి 10 రూపాయలు ఇవ్వడం ద్వారా పర్యావరణానికి మేలు చేస్తున్న పార్క్ అధికారులపై అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి