iDreamPost

కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ నటి! పోస్ట్ వైరల్..

తెలుగులో పాపులర్ సీరియల్స్ లో నటిస్తున్న ప్రముఖ నటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇందుకు సంబంధించి ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వివరాలు..

తెలుగులో పాపులర్ సీరియల్స్ లో నటిస్తున్న ప్రముఖ నటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇందుకు సంబంధించి ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వివరాలు..

కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ నటి! పోస్ట్ వైరల్..

ప్రముఖ తెలుగు సీరియల్ నటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. తాను తల్లి అయిన దగ్గర నుంచి ట్విన్స్ కు జన్మనిచ్చిన వరకు తన ప్రయాణం ఎలా సాగిందో ఈ వీడియోలో చూపించింది. ఈమె భర్త కూడా సీరియల్ డైరెక్టర్ కావడం విశేషం. ఇక వీరికి ఇదివరకే 10 సంవత్సరాలు ఉన్న కొడుకు కూడా ఉన్నాడు. తెలుగులో పాపులర్ అయిన సీరియల్స్ లో లీడ్ రోల్ చేస్తూ పుల్ బిజీగా ఉంటుంది ఈ నటి. మరి ట్విన్స్ ను కన్న ఆ నటి ఎవరు? తెలుసుకుందాం పదండి.

ప్రముఖ తెలుగు సీరియల్ నటి కరుణ భూషణ్ రెండో సారి తల్లిగా ప్రమోషన్ పొందింది. అయితే ఈసారి ఆమె ఆనందం డబుల్ అయ్యింది. ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇక తాను తల్లి అయిన దగ్గర నుంచి ట్విన్స్ కు జన్మనిచ్చే వరకు తన ప్రయాణాన్ని ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది. “7వ నెలలోనే వీరు జన్మించారు. నా ఏంజెల్స్ నా సంతోషాన్ని రెట్టింపు చేశారు. ఇక నా ప్రతీ కష్టంలోనూ తొడున్న దుర్గామాతకు చేతులెత్తి నమ్మస్కరిస్తున్నాను. నేను చిన్నది అడిగితే.. ఆమె దానికి రెట్టింపు ఇస్తుంది” అంటూ రాసుకొచ్చింది.

ఇక కరుణ భూషణ్ కెరీర్ విషయానికి వస్తే.. ‘ఆహా’ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి.. ఆ తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, నిన్నే ఇష్టపడ్డాను, కాటమరాయుడు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పూర్తిగా సీరియల్స్ వైపు మళ్లింది. ‘మెుగలి రేకులు నుంచి వైదేహీ పరిణయం’ వరకు ఎన్నో సీరియల్స్ లో నటించింది. ముఖ్యంగా ‘అభిషేకం’ సీరియల్ కరుణకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో ఆమె నటనకు, అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ‘వైదేహీ పరిణయం’ సీరియల్లో నెగటీవ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తోంది. ట్విన్స్ పుట్టిన సందర్భంగా సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Karuunaa Bhushan (Nethikaruna) (@karuunaa_bhushan)

 

View this post on Instagram

 

A post shared by Bharath Bhushan Nethi (@bharathbhushan_nethi)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి