Venkateswarlu
ఈ ఇద్దరూ తరచుగా బయట జంటగా కనిపిస్తూ ఉండటంతో ఆ వార్తలకు బలం చేకూరుతోంది. ఇరు కుటుంబాలకు సంబంధించిన ఫంక్షన్లు.. లేదా ఇతర కార్యక్రమాలకు ఇద్దరూ జంటగా వెళుతున్నారు. వీలు చిక్కినపుడు షికార్లు చేస్తూ ఉన్నారు.
ఈ ఇద్దరూ తరచుగా బయట జంటగా కనిపిస్తూ ఉండటంతో ఆ వార్తలకు బలం చేకూరుతోంది. ఇరు కుటుంబాలకు సంబంధించిన ఫంక్షన్లు.. లేదా ఇతర కార్యక్రమాలకు ఇద్దరూ జంటగా వెళుతున్నారు. వీలు చిక్కినపుడు షికార్లు చేస్తూ ఉన్నారు.
Venkateswarlu
శ్రీదేవి కూతురు, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ తరచుగా బయట జంటగా కనిపిస్తూ ఉండటంతో ఆ వార్తలకు బలం చేకూరుతోంది. ఇరు కుటుంబాలకు సంబంధించిన ఫంక్షన్లు.. లేదా ఇతర కార్యక్రమాలకు ఇద్దరూ జంటగా వెళుతున్నారు. వీలు చిక్కినపుడు షికార్లు చేస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా, ఈ జంటకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
ఆదివారం ఇద్దరూ కారులో జంటగా జాన్వీ కపూర్ సోదరుడు అర్జున్ కపూర్ ఇంటి వద్ద కనిపించారు. అర్జున్ కపూర్ జరుగుతున్న ఫంక్షన్లు ఇద్దరూ కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. జాన్వీ-శిఖర్ ఇద్దరూ తెల్ల దుస్తుల్లో కనిపించారు. వారిద్దరినీ చూసిన వెంటనే పపరజీలు తమ కెమెరాలకు పని చెప్పారు. ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఇక, పపరజీలను చూడగానే జాన్వీ చిరునవ్వులు చిందించటం మొదలుపెట్టారు. ఆమె పక్కనే కూర్చున్న శిఖర్ మాత్రం పపరజీల వైపు చూడలేదు. సెల్‌ఫోన్ వాడ్డంలో బిజీ అయిపోయాడు.
కాగా, జాన్వీ కపూర్.. జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. త్వరలో జాన్వీ ‘దేవర’ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇక, ‘దేవర’ సినిమా గురించి తాజా ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ.. ‘‘ నేను సౌత్‌లో ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. నా మొదటి తెలుగు సినిమాకు సంతకం చేశాను. త్వరలో షూటింగ్‌లో పాల్గొంటాను. ఆ పాత్ర నాకు ఎంతో ప్రత్యేకం. సౌత్ సినిమా అంటే నా సొంతింటికి వెళుతున్న భావన కలుగుతోంది’’ అని అన్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.