Arjun Suravaram
Telangana: తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించడంతో వాటిని కట్టేందుకు జనాలు ఎగపడుతున్నారు. అయితే కొందరికి మాత్రం డిస్కౌంట్లు రావడం లేదు. ఈ విషయంపై హైదరాబాద్ పోలీసులు స్పష్టతను ఇచ్చారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించడంతో వాటిని కట్టేందుకు జనాలు ఎగపడుతున్నారు. అయితే కొందరికి మాత్రం డిస్కౌంట్లు రావడం లేదు. ఈ విషయంపై హైదరాబాద్ పోలీసులు స్పష్టతను ఇచ్చారు.
Arjun Suravaram
చాలా మంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తుంటారు. ఈ క్రమంలో వారి వాహనాలపై భారీగా చలాన్లు పడుతుంటాయి. కొందరు ఎప్పటికప్పుడు కట్టుకోగా.. మరికొందరు మాత్రం పెండింగ్ లో పెడుతుంటారు. ఇలా భారీ మొత్తంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉండిపోతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు వాహనదారులకు ఆఫర్లు ఇస్తుంటాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా డిస్కౌంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ డిస్కౌంట్ లో ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై భారీగా డిస్కౌంట్ ప్రకటించింది. ఈ అవకాశం డిసెంబర్ 26 నుంచి అందుబాటులోకి వచ్చింది. జనవరి 10వ తేదీ వరకు ఈ ఆఫర్ తో వాహనదారులు తమ చలాన్లు కట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించడంతో బుధవారం ఉదయం నుంచి వాహనదారులు పెండింగ్ లో ఉన్న తమ చలాన్లు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరికి రాయితీ వర్తించడం లేదు. ఎందుకిలా జరిగిందని చాలా మంది సందేహం వ్యక్తం చేశారు. అయితే ఈ డిస్కౌంట్ అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు వర్తించదని తెలిసింది.
ఈనెల 22న తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు కట్టేందుకు భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాక మంగళవారం దీనికి సంబంధించిన జీవోను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ రవాణా, రోడ్లు భవనాల శాఖ జీవో నెంబర్ 659ను జారీ చేసింది. దాని ప్రకారం. 2024 జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లకు రాయితీ వర్తిస్తుందని పేర్కొంది.
తెలంగాణలో అన్ని రకాల వాహనాలకు చలాన్లపై ఈ రాయితీ వర్తిస్తాయి. కానీ, ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు ఉన్న చలాన్లకు మాత్రమే వర్తిస్తాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక నెటిజన్ వేసిన ప్రశ్నకు పోలీసులు ట్విట్టర్ లోనే సమాధానమిస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. తన వాహనానికి ఉన్న చలాన్లపై డిస్కౌంట్ వర్తిండం లేదంటూ ఓ నెటిజన్ స్క్రీన్ షాట్ ను షేర్ చేశాడు. అతడి ట్వీట్ పై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. వారు సమాధానమిస్తూ.. 2023 నవంబర్ 30 కంటే ముందు ఉన్న పెండింగ్ చలాన్లకు మాత్రమే రాయితీ వర్తిస్తాయని పేర్కొన్నారు. దీనిని బట్టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం వాహనాలపై పడిన చలాన్లకు డిస్కౌంట్ లేదని స్పష్టమవుతోంది.
Dear @HYDTP ,@CYBTRAFFIC
Before and after the discount, the fine amount is the same. Please resolve the issue and confirm. @TelanganaCOPs @RCKTRAFFIC @AddlCPTrHyd #TrafficDiscounts pic.twitter.com/iPagk3Rido— SAI KIRAN YADAV (@saikiran37) December 27, 2023