హైదరాబాద్ లోని ఆ మార్గాల్లో.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు!

Traffic Restrictions In Hyderabad: హైదరాబాద్ నగర వాసులకు తరచూ ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించిన అలెర్ట్ వస్తుంటుంది. అలానే తాజాగా నగరంలోని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. నేడు, రేపు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Traffic Restrictions In Hyderabad: హైదరాబాద్ నగర వాసులకు తరచూ ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించిన అలెర్ట్ వస్తుంటుంది. అలానే తాజాగా నగరంలోని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. నేడు, రేపు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలోని నలుమూలల నుంచి ఎందరో ఉపాధి కోసం ఇక్కడి వచ్చి..జీవనం సాగిస్తున్నారు. భాగ్యనగరం ఎంతో అభివృద్ధి చెందడంతో పాటు అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ నగర వాసులకు ప్రధాన సమస్యలో ట్రాఫిక్ ఒకటి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్న ట్రాఫిక్ సమస్య అనేది ఇంకా కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే.. వివిధ సందర్భాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. తాజాగా నేడు, రేపు హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రస్తుతం భాగ్యనగరంలో బోనాల పండగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏటా ఈ జాతను ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ సారి కూడా బోనాల పండగకు నగరం సిద్దమైంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బోనాల జాతర ను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారు. దీంతో వారికి ఇబ్బందులు కలగకుండా పోలీసులు, అధికారులు చర్యలు చేపట్టారు.

ఆది, సోమవారం రోజుల్లో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పోలీస్ ఉన్నతాధికారులు విధించారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంకు రెండు కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలైన కర్బాలా మైదాన్, రాణిగంజ్, రామ్ గోపాల్ పేట్, ఓల్డ్ పీఎస్, పారడైజ్, సీటీవో ప్లాజా వైపు వచ్చే వాహనాలు వేరే మార్గాలను చూసుకోవాలి. అలానే ఎస్బీఐ ఎక్స్ రోడ్, వైఎంసీ ఎక్స్ రోడ్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, పార్క్ లేన్ బాటా, బైబిల్ హౌజ్, మినిస్టర్ రోడ్, రసూల్ పురా వెళ్లే వాహనదారులు  కూడా నేడు రేపు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

అదే విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులను పోలీసులు కీలక సూచనలు చేశారు.  రైల్వే స్టేషన్ లోకి ప్లాట్ ఫాం నంబర్ 1 నుంచి కాకుండా ప్లాట్ ఫాం నంబర్ 10 నుంచి లోపలికి  వెళ్లాలని ప్రయాణికులకు సూచించారు. ఇక ఉజ్జయినీ బోనాల జాతర సందర్భంగా టోబాకో బజార్ నుంచి మహంకాళి ఆలయంకు వచ్చే రోడ్ ,బాటా ఎక్స్ రోడ్ నుంచి రాంగోపాల్ పేట  పీఎస్ వరకు, జనరల్ బజార్ రోడ్, ఆదయ్య ఎక్స్ రోడును నేడు, రేపు మూసివేయనున్నారు. మొత్తంగా ఈ రెండు రోజుల పాటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల వైపు వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాల చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Show comments