మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలకు శుభవార్త చెప్పిన CM రేవంత్‌ రెడ్డి!

CM Revanth Reddy, Hyderabad, Hydra: హైదరాబాద్‌లోని మూసీ పరివాహన ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గుడ్‌న్యూస్‌ చెప్పారు. మరి ఆ గుడ్‌న్యూస్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

CM Revanth Reddy, Hyderabad, Hydra: హైదరాబాద్‌లోని మూసీ పరివాహన ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గుడ్‌న్యూస్‌ చెప్పారు. మరి ఆ గుడ్‌న్యూస్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్‌ ప్రజల గుండెల్లో హైడ్రా రైళ్లు పరిగెట్టిస్తోంది. నగరాన్ని వదరల ముప్పు నుంచి కాపాడేందుకే మంచి చర్యలు తీసుకుంటున్నారని కొంతమంది హైడ్రా చర్యలను అభినందిస్తుంటే.. పేద, మధ్య తరగతి వాళ్లు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తున్నారంటూ మరికొంత మంది మండిపడుతున్నారు. కొంతమంది బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే మూసీ పరివాహక ప్రాంతంలో కూడా రెవెన్యూ అధికారులు గురువారం సర్వే చేపట్టారు. కొన్ని ఇళ్లకు RB-X అనే అక్షరాలను రాశారు. దీంతో.. బాధితులు హైడ్రా సర్వే చేస్తున్నారని.. తమ ఇళ్లను కూల్చేస్తారని భయాందోళనలకు గురై.. సర్వేకి వచ్చిన అధికారులపై తిరగబడ్డారు.

ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం మూసీ చుట్టుపక్కల ఉండే వారికి ఒక గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎఫ్‌టీఎల్‌(ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌) పరిధిలోకి వచ్చే వారికి రిహ్యాబిల్టేషన్‌(పునరావాసం) కల్పించి.. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయిస్తామని ప్రభుత్వం జీరో జారీ చేసింది. మూసీ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో దాదాపు 16 వేల నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. వారికి.. కేటాయించేందుకు 15 వేల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను మంజూరు చేస్తూ.. సీఎం రేవంత్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. అయితే.. గురువారం మూసీ పరివాహక ప్రాంతంలో జరిగిన సర్వేతో హైడ్రాకు సంబంధం లేదని అధికారులు తెలిపారు. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన విషయం తెలిసిందే.

ఆ ప్రాజెక్ట్‌లో భాగంగానే.. మూసీ పరివాహక ప్రాంతంలో, ముఖ్యంగా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నివాసం ఉంటున్న పేదలకు ముందుగా పునరావాసం కల్పించాలని, అందుకోసం 15 వేల డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను కేటాయిస్తూ.. జీఓ జారీ చేసింది. ఈ విషయాన్ని స్థానిక తహసీల్డార్‌ కూడా వెల్లడించారు. పునరావాసం కల్పించాల్సిన ఇళ్లపై ‘RB-X’ అని రాస్తున్నట్లు తెలిపారు. RB-X అంటే రిహ్యాబిల్టేషన్‌ కల్పించాల్సిన ఇళ్లు అని అర్థం అని అధికారులు తెలిపారు. అయితే.. స్థానిక ప్రజలు మాత్రం.. తమను హైడ్రా అధికారులు అనుకొని కంగారు పడుతున్నారని, మేం ఇళ్లు కూల్చివేసేందుకు రాలేదని, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న పేదలకు డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయించే సర్వే కోసం వచ్చినట్లు తెలిపారు. మరి మూసీ సుందరీకరణలో భాగంగా.. పేదలకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments