ప్రయాణికులకు TGSRTC శుభవార్త.. వారి కోసం అదనపు బస్సులు

TGSRTC-Special Buses For Secunderabad Ujjaini Bonalu 2024: హైదరాబాద్‌ ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్‌టీసీ భారీ శుభవార్త చెప్పింది. అదనపు సర్వీసులు తెచ్చేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

TGSRTC-Special Buses For Secunderabad Ujjaini Bonalu 2024: హైదరాబాద్‌ ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్‌టీసీ భారీ శుభవార్త చెప్పింది. అదనపు సర్వీసులు తెచ్చేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

తెలంగాణ ప్రజలకు టీజీఎస్‌ఆర్‌టీసీ భారీ శుభవార్త చెప్పింది. వారి కోసం అదనపు బస్సులు, సర్వీసులు నడిపేందుకు రెడీ అవుతోంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. దాంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీనిపై మగవారు, విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము ఛార్జీలకు డబ్బులు చెల్లించి కూడా నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రద్దీకి తగ్గట్టుగా బస్సుల సంఖ్యను కూడా పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆర్టీసీ చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లో వారి కోసం అదనపు బస్సులు నడిపేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

తెలంగాణలో ఆషాఢ బోనాల సందడి మొదలైంది. ఇప్పటికే గోల్కండ బోనాలతో ఈ ఉత్సవాలు ప్రారంభం కాగా.. ఈ ఆదివారం అనగా జూలై 21, 22న సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర  జరగనుంది. ఎంతో వైభవంగా జరిగే ఈ బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ నలుమూల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బోనాలకు వెళ్లే భక్తులకు టీజీఎస్‌ఆర్‌టీసీ శుభవార్త చెప్పింది. వారి కోసం అదనపు బస్సులు నడిపేందుకు రెడీ అవుతోంది. సికింద్రాబాద్‌ బోనాల కోసం.. ఆర్టీసీ గ్రేటర్‌లోని 24 ప్రాంతాల నుంచి 175 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, పటాన్‌ చెరు, ఈసీఐఎల్‌, మెహిదీపట్నం, దిల్‌షుక్‌ నగర్‌, కూకట్‌పల్లి, చార్మినార్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి, పాత బోయిన్‌పల్లి, మల్కాజిగిరి, తదితర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశాను. బోనాలకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సజ్జనార్‌ సూచించారు.

ఐదుగురికి మాత్రమే అనుమతి..

ఉజ్జయినీ మహంకాళి బోనాల వేడుకలకు సంబంధించి.. ఈ ఏడాది అధికారులు అనేక కీలక మార్పులు చేశారు. ఈసారి ఆలయంలోకి జోగినీలు, శివసత్తులతో పాటు ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అలాగే మధ్యాహ్నం 1:30 నుంచి సా.4 గంటల లోపు బాట కూడలి నుంచి మాత్రమే భక్తులు వచ్చేలా ప్రణాళికలు రూపొందించారు అధికారులు. బోనాల అనంతరం నిర్వహించే ఫలారం బండి (తొట్టెల) ఊరేగింపులకు రాత్రి 12 గంటల వరకు మాత్రమే పర్మిషన్‌ ఇస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల నేపథ్యంలో.. తెలంగాణ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బోనాల ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని, బోనాల కోసం వచ్చే భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని తెలిపారు. అంతేకాక ఆలయం వద్ద నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు రెండు 500 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లను అందుబాటులో ఉంచాలన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగని చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.

Show comments