Orange Alert For Those Districts: మళ్లీ పెరిగిన ఎండలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. బయటకు రావొద్దంటూ!

మళ్లీ పెరిగిన ఎండలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. బయటకు రావొద్దంటూ!

Orange Alert For Telangana Districts: తెలంగాణ ప్రజలు వచ్చే మూడ్రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలి అంటూ హైదరాబాద్ వాతవరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు దాదాపు 44 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

Orange Alert For Telangana Districts: తెలంగాణ ప్రజలు వచ్చే మూడ్రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలి అంటూ హైదరాబాద్ వాతవరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు దాదాపు 44 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కాస్త భానుడి భగభగల నుంచి తప్పించుకున్నారు. కానీ, గత రెండు మూడు రోజులుగా మళ్లీ ఎండలు పెరిగిపోయాయి. ఇంటి నుంచి బటటకు వచ్చే పరిస్థితి కనిపిచండం లేదు. ఎక్కడ చూసినా పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరం, అత్యవసరం అయితేనే బయటకు రావాలంటూ చెప్తున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. అక్కడ ఎండలు మరింత పెరగనున్నాయి అంటున్నారు. వచ్చే మూడ్రోజుల పాటు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని చెప్తున్నారు.

వాతావరణం గత రెడు వారాలు చల్లగానే అనిపించింది. అక్కడక్కడ చెదురు మొదురు వానలతో అంతా ప్రశాంతంగా ఉన్నారు. కానీ, మళ్లీ ఇది ఎండాకాలం అనే విషయం తెలుస్తోంది. ప్రస్తుతం ఎండలు భయంకరంగా పెరిగిపోయాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటోంది. అయితే మే 30న తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పగటిపూట ఉష్ణోగ్రతలు ఏకంగా 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈ ఉష్ణగ్రోతలు ఏ ఒక్క జిల్లాకో కాదు.. దాదాపుగా రాష్ట్రం మొత్తం ఇలాగే ఉండే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతవారణ శాఖ అధికారులు హెచ్చరించారు.

మే 31, జూన్ 1వ తారీఖుల్లో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీమ్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లె, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ జిల్లాలకు అధికారులు వచ్చే మూడ్రోజులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అంటే ఆ జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. వాతావరణం పొడిగా ఉంటుంది. అలాగే వేడి గాలులు కూడా వీచే అవకాశం ఉంది. అందుకే అవసరం అయితేనే బయటకు రావాలి అంటూ హెచ్చరిస్తున్నారు.

అలాగే 31వ తారీఖు మాత్రం కొన్ని ప్రాంతాల్లో చెదురు మొదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ముసలి వాళ్లు, గర్భిణీలు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ హెచ్చరిస్తున్నారు. తగినంత మోతాదులో నీళ్లు తాగడం, చల్లటి ప్రదేశాల్లోనే ఉండటం, బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చేయాలని సూచిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉంది. అక్కడ కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఉక్కపోతకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతుపవనాలు వస్తే.. జూన్ రెండో వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది.

Show comments