Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ స్కీమ్ పై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన!

రేవంత్ రెడ్డి సర్కార్ మహాలక్ష్మి పేరుతో మహిళలకు వివిధ పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వాటిల్లో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల కరెంట్ ఉచితం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ వంటివి అమలు చేస్తున్నారు. తాజాగా గ్యాస్ సిలిండర్ స్కీమ్ పై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది.

రేవంత్ రెడ్డి సర్కార్ మహాలక్ష్మి పేరుతో మహిళలకు వివిధ పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వాటిల్లో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల కరెంట్ ఉచితం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ వంటివి అమలు చేస్తున్నారు. తాజాగా గ్యాస్ సిలిండర్ స్కీమ్ పై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్లింది. వాటిల్లో మహిళలకు రూ.500 గ్యాస్, సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, మహలక్ష్మీ పేరుతో మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం అని హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలకు కసరత్తు ప్రారంచి.. అమలు కూడా చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి స్కీమ్ ను 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ అమలు చేస్తోంది. రూ.500కు వంటగ్యాస్‌ సిలిండర్‌ అందజేత పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసింది. ఇదే సమయంలో రూ.500కు గ్యాస్ సిలిండర్ పై తెలంగాణ పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే అధికారంలోకి మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్ర స్థానికత్వం కలిగిన మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. అలాగే, రాజీవ్ ఆరోగ్య శ్రీ ఖర్చు పరిమితిని రూ.25 లక్షలకు పెంచేశారు. అలానే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ను అమలు చేస్తున్నారు. అదే విధంగా రూ.500కే గ్యాస్ సిలిండర్  స్కీమ్ ను కూడ అమలు చేస్తున్నారు.

స్థానిక, రేషన్ కార్డు ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాలను అందిస్తుంది. అర్హులైన వారందరికి మహలక్ష్మి పథకం కింద అన్ని పథకాలు అందేలా చర్యలు తీసుకుంటుంది. అందుకే రూ.500కే గ్యాస్ సిలిండర్ అర్హులైన వారికి అందిస్తుంది. ఇలా రూ.500 సిలిండర్ స్కీమ్ కింద  సబ్బిడీ డబ్బులు లబ్ధిదారులు అకౌంట్లోలో వేస్తున్న సంగతి తెలిసిందే. ఆ విషయం అలా ఉంచితే. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకంపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. 18.86 లక్షల మంది  రూ.500 గ్యాస్ సిలిండర్ స్కీమ్ ను వినియోగించుకున్నారని తెలిపింది. 2024 ఏప్రిల్ 13 నాటికి కొందరు రెండో రాయితీ సిలిండర్ కూడా పొందారని పౌరసరఫరాల శాఖ తెలిపింది. మొత్తంగా 21.29 లక్షల మందికి రూ.59.97 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపింది.

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 39.33 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు రూ.500కు సిలిండర్ పథకానికి అర్హులుగా గుర్తించారు. మొత్తంగా ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలే చేయడంపై కాంగ్రెస్ పార్టీ దృష్టిసారించింది. ఇప్పటికే మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తుంది.  స్కీమ్ కి భారీగా  ఆదరణ లభించింది. చిన్న చిన్న సమస్యలు మినహా ఈ స్కీమ్ సక్సెస్ ఫుల్ గా సాగుతుందని అధికారులు చెబుతున్నారు. అలానే మిగిలిన పథకాలను అర్హులైన వారికి అందేలా కూడా  చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ పై  పౌరసరఫరాల శాఖ చేసిన ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments